తెలుగు స్టార్ హీరో నందమూరి నట సింహం బాలయ్య వరుస హిట్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఇటీవల భగవంత్ కేసరి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా కూడా బాక్సఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది.. ఇప్పుడు మరో రెండు సినిమాలను లైనప్ లో పెట్టుకున్నాడు.. ఇక ప్రస్తుతం బాలయ్య లైన్ అప్ లో ఉన్న సినిమాలలో బాబీ తో ఒకటి.. అఖండకి సీక్వెల్ గా అఖండ 2 ఒకటి. ఇక బోయపాటి, బాలయ్య కాంబినేషన్ ఆల్రెడీ ఒకసారి చూశారు కనుక ఈ సినిమాపై బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తి చూపించలేదని తెలుస్తుంది..
బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా అంచనాలు భారీగానే ఉన్నాయి.. ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ లో బాలయ్య గెటప్ డిఫరెంట్ గా ఉండనుందట. అదేవిధంగా ఈ సినిమాలో నాని హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.. దీనిపై చిత్ర యూనిట్ మాత్రం స్పందించలేదు.. కానీ తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
ఓ బేబీ సినిమాతో బాగా పాపులర్ అయిన హీరోయిన్ వైష్ణవి చైతన్య బాలయ్య సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని వార్త ఇండస్ట్రీలో షికారు చేస్తుంది.. బేబీ మూవీలో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ భారీ హిట్ అవడంతో వరుస సినిమా అవకాశాలు కూడా ఈమెకి దక్కుతున్నాయి. ఇక తాజాగా వైష్ణవి చైతన్య కి బాలయ్య సినిమాలో ఛాన్స్ దక్కినట్లు తెలుస్తుంది.. బాలయ్య సినిమాలో ఓ రోల్ చేస్తుందని తెలుస్తుంది..ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతుంది.. బాలయ్య సినిమాలో ఛాన్స్ రావడం మాటలు కాదు.. వైష్ణవి చైతన్య సైతం బాలయ్య సినిమాలో నటిస్తే ఈమెకి తిరిగే ఉండదు.. దీనిపై మేకర్స్ త్వరలోనే ప్రకటన ఇవ్వనున్నట్లు తెలుస్తుంది..