రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన మేరకు 6 నెలల్లో కులగణన చేపట్టడానికి తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఆగమాగం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. మంగళవారం నాడు వరంగల్ లో బీసీ హక్కుల సాధన కోసం భారత…
వాట్సాప్ వినియోగదారుల భద్రత కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందిస్తుంది.. అందుకే వినియోగదారులు రోజురోజుకు పెరిగిపోతున్నారు.. ఇటీవల ఎన్నో ఫీచర్స్ ను తీసుకొచ్చింది.. తాజాగా వాట్సాప్ యూజర్స్ కు ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది.. ఇప్పుడు ఆండ్రాయిడ్ వాట్సాప్ యూజర్లు తమ చాట్ బ్యాకప్ డేటాను గూగుల్ డ్రైవ్‌లో సేవ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సేవలు ఉచితం. అయితే, 2024 నుండి గూగుల్ డ్రైవ్‌లో ఉచిత అపరిమిత బ్యాకప్‌లను ఇవ్వబోనున్నట్లు తెలిపారు.. ఇక నుంచి…
దక్షిణ తెలంగాణ లీడర్లతో బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. ఈ సంద్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఈనెల 13 న నల్లగొండ లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు… నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల నుంచి ప్రజలు తరలించాలని పార్టీ నేతలకు సూచించారు. ఇదంతా పాలకులకు ప్రాజెక్ట్ లు, నీళ్ళ గురించి అవగాహన లేకపోవడం తో కేంద్రం గేమ్ స్టార్ట్ చేసిందని ఆయన అన్నారు. ప్రాజెక్ట్ లు ఆధీనం లోకి వెళితే తెలంగాణ…
అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. జిల్లా సరిహద్దుల్లో తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్‌ను వాహనంతో ఢీకొట్టి చంపారు. కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో ఉన్న కారుతో ఢీకొట్టడంతో ఒక కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు సోమవారం రాత్రి తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలు కాస్త ఆసక్తిగానే ఉంటాయి.. ప్రముఖ స్టార్ హీరోలు అందరూ కొత్త పార్టీ పెడుతున్నారు.. నిన్న విజయ్ దళపతి కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చాడు.. ఇప్పుడు అదే దారిలో మరో స్టార్ హీరోయిన్ వెళుతున్నాడు..త్వరలోనే కొత్త పార్టీని కూడా అనౌన్స్ చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.. ఎంజీఆర్, విజయ్ కాంత్, కమల్ హాసన్ రాజకీయ పార్టీలను ఏర్పాటు చేశారు. ఇటీవలే తమిళ నటుడు…
ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ విద్యా శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అసెంబ్లీలోని బొత్స సత్యనారాయణ ఛాంబర్‌లో కీలక సమీక్ష చేపట్టారు. ఈ కీలక సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఒక రోజు పాటు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. వాయిదా తీర్మానంపై చర్చించాలని టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ధరల పెరుగుదలపై చర్చించాలని సభలో టీడీపీ డిమాండ్ చేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌లపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని ఫైర్ అయ్యారు. జగన్ జనంలోకి వెళుతుంటే టీడీపీ, జనసేన షేక్ అవుతున్నాయని ఆయన అన్నారు. 2014లో ఉమ్మడి పోటీగా ఇచ్చిన హామీల్లో ఒకటైనా నెరవేర్చారా అంటూ ప్రశ్నించారు.
ఇవాళ సర్పంచుల ఛలో అసెంబ్లీ తరుణంలో నిన్నటి నుంచే సర్పంచులను హౌస్ అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. ఏపీ సర్పంచుల సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌ను నిన్ననే(సోమవారం) హౌస్ అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న సర్పంచులను అక్కడే హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. హై అలర్ట్ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సర్పంచులు డిమాండ్ల పరిష్కారం కొరకు చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారు.
కుటుంబంలో రేగిన కలతలు చివరకు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి పల్నాడు జిల్లాలో ఓ కుటుంబంలో రేగిన వివాదం విషాదంగా మారింది. మాచర్ల మండలం నారాయణపురం తండాలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు కన్న తల్లి కోపానికి బలైయ్యారు.... కుటుంబ కలహాలతో కన్నతల్లి, తన ముగ్గురు పిల్లలకు, భర్తకు కూడా టీలో ఎలుకల మందు కలిపి ఇచ్చింది.