Samantha : నెగెటివిటీ ఉంటే బ్లాక్ చేస్తా.. ట్రోలర్లకు సమంత ‘స్ట్రాంగ్’ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్పీడ్ అప్ చేశారు. చాలా కాలం తర్వాత ఆమె నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram) మే 15న విడుదలకు సిద్ధమవుతోంది.నందినీ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, సమంత స్వయంగా నిర్మిస్తున్నారు. దీంతో పాటు రాజ్ & డీకే దర్శకత్వంలో ‘రక్త బ్రహ్మాండం’ అనే వెబ్ సిరీస్‌లో కూడా సమంత నటిస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన సామ్, తన వ్యక్తిగత విషయాలతో పాటు సోషల్ మీడియాలో వచ్చే నెగెటివిటీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : Naresh-Pavitra: ఆమె వచ్చాకే నాన్న అలా మారాడు.. నరేష్ పై కొడుకు నవీన్ షాకింగ్ కామెంట్స్..
Also Read
ఇన్‌స్టాగ్రామ్ ‘AMA’ సెషన్‌లో భాగంగా నెగెటివ్ కామెంట్లను ఎలా ఎదుర్కొంటారు? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమంత తనదైన శైలిలో స్పందించారు.. ‘ప్రశంసలు నన్ను పొంగిపోయేలా చేయవు, అలాగని ట్రోల్స్ నన్ను కుంగదీయవు. కానీ నా డిజిటల్ స్పేస్‌లోకి నెగెటివిటీని తీసుకొస్తే మాత్రం సహించను. నా ఇంటిని నేను ఎంత శుభ్రంగా ఉంచుకుంటానో, నా సోషల్ మీడియా పేజీని కూడా అంతే క్లీన్‌గా ఉంచుకుంటాను. ఎవరినైనా బ్లాక్ చేశానంటే వారు నన్ను బాధపెట్టారని కాదు, నా ప్రపంచంలోకి వారికి ప్రవేశం లేదని అర్థం’ అని సమంత ఘాటుగా సమాధానమిచ్చారు. సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ సమయం వృధా చేయడం తనను కూడా భయపెడుతోందని ఆమె అంగీకరించారు. ఆ ఏకాగ్రతను తిరిగి పొందేందుకు పుస్తకాలు చదవడం, పాడ్‌కాస్ట్‌లు వినడం వంటి నియమాలను పాటిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ ఒత్తిడి లేదా బాధ కలిగినప్పుడు తాను ధ్యానం (Meditation) చేస్తానని, ఏదైనా ఫన్నీ విషయం ఎదురైతే కిందపడి మరీ నవ్వుతానని తన మనసులోని మాటను పంచుకున్నారు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!