రాజ్యాంగ బద్ధంగా నియమితుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు పిచ్చెక్కినట్లు మాట్లాడుతున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ అన్నారు. ప్రజా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావడాన్ని మింగుడుపడక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సభలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తో కలిసి మధుయాష్కీ పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్…
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నీళ్ల గురించి మాకు తెలుసు కాబట్టే నాగార్జున సాగర్ కట్టామన్నారు. నీళ్ల గురించి మాకు తెలుసు కాబట్టే శ్రీశైలం కట్టామని ఆయన పేర్కొన్నారు. నీకు తెలియదు కాబట్టి కూలి పోయేలా కాళేశ్వరం కట్టావు కేసీఆర్ అని ఆయన విమర్శలు గుప్పించారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మాకు…
సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ కేసు విచారణకు తెలంగాణ మంత్రి దామోదర రాజ నర్సింహ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అంశంపై తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఢిల్లీలో న్యాయవాదులతో మాట్లాడాం.. సుప్రీంకోర్టు కు హాజరై వాదనలు విన్నాం.. వాదనలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్…
అమీర్ ఖాన్-నటించిన సర్ఫరోష్‌లో సలీమ్ పాత్రను పోషించినందుకు బాగా ప్రసిద్ది చెందిన ముఖేష్ రిషి ఇటీవలి ఇంటర్వ్యూలో సర్ఫరోష్ విడుదలైన తర్వాత హిందీ సినిమాలో మరిన్ని అవకాశాలు ఆశిస్తున్నానని, అయితే అతని కెరీర్ సరిగ్గా ఆ విధంగా సాగలేదని పంచుకున్నారు.. బాలీవుడ్ నిర్మాతల నుండి కాల్స్ రావడానికి బదులు, దక్షిణాది చిత్ర పరిశ్రమ నుండి తనకు చాలా కాల్స్ రావడం ప్రారంభించానని, ప్రతికూల పాత్రలు పోషించడంలో పేరుగాంచిన నటులలో ఒకరిగా స్థిరపడ్డానని ముఖేష్ పంచుకున్నాడు.. సర్ఫరోష్ విడుదలయ్యాక…
గ్రూప్-1లో మరో 60 పోస్ట్‌ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ద్వారా 60 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉద్యోగ నోటిఫికేషన్‌లను విడుదల చేసింది. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం త్వరలో రిక్రూట్‌మెంట్ పరీక్షను నిర్వహించనుందని ఆ ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు, నియామక ప్రక్రియ ను వేగంగా చేయాలని సర్వీస్…
రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎప్‌సెట్ (TS EAPCET) పరీక్షాతేదీలు ఖరారయ్యాయి. ఈ పరీక్షలను మే 9 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షను ఇదివరకు టీఎస్ ఎంసెట్‌గా పిలిచేవారు. ఇటీవల టీఎస్ ఎప్‌సెట్‌గా మారుస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే మంగళవారం JNTUH, TS EAPCET-2024 కన్వీనర్, ప్రొఫెసర్, సివిల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ బి డీన్ కుమార్ మంగళవారం…
ఈ మధ్య ఎక్కువ మంది ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం కన్నా నోటికి రుచిగా ఉండే ఫాస్ట్ ఫుడ్ ను ఎక్కువగా తింటున్నారు.. అందులో గోభి అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.. ఆ రుచి అలాంటిది మరి.. ఇంట్లో చేసుకోవడం లేదా సమయం లేనప్పుడు బయటకు వెళ్లి ఎవరికి తగ్గట్లు వాళ్లు తింటారు.. చాలా మంది ఫేవరెట్ ఫుడ్‌పై నిషేధం విధించింది గోవాలోని ఓ పట్టణంలో గోబీని ఎక్కడా అమ్మకూడదని తేల్చేసింది.. ఎందుకు అలా చేసిందో అనేది…
రోజు రోజకు ఆడపిల్లలపై ఆఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తమ స్థాయిని మరిచి చిన్నా పెద్దా తేడా లేకుండా తమ కామకోరికలను తీర్చుకునేందుకు ప్రేమ, పెళ్లి పేర్లను అడ్డుపెట్టుకుంటున్నారు. తీరా కావాల్సిన కోరిక తీరాక ముఖం చాటేస్తున్నారు. అలాంటి ఘటనే ఇది. 22 ఏళ్ల బాధితురాలి ఫిర్యాదుతో కర్ణాటక పోలీసులు హాకీ ప్లేయర్ వరుణ్ కుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బెంగళూరు నగరంలోని జ్ఞానభారతి పోలీసులు వరుణ్ కుమార్‌పై లైంగిక నేరాల నిరోధక చట్టంలోని సెక్షన్…
తెలంగాణలో అప్పుడే భానుడి భగభగలు మొదలయ్యాయి. వింటర్ సీజన్ పూర్తిగా పోకుండానే సూర్యుడు ఠారెత్తిస్తున్నాడు. ఎండలు ఎడతెరిపి లేకుండా మండిపోవడంతో హైదరాబాద్‌లోని మోండా మార్కెట్, హయత్‌నగర్, బేగంపేట ప్రాంతాల్లో మంగళవారం 36.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) గణాంకాల ప్రకారం, కాప్రా, సరూర్‌నగర్, చార్మినార్, రాజేంద్రనగర్, మెహదీపట్నం, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌తో సహా అనేక ఇతర ప్రాంతాలలో కూడా గత 24 గంటల్లో ఉష్ణోగ్రతల స్థాయిలు 35 డిగ్రీల సెల్సియస్ కంటే…
తెలంగాణ ప్రభుత్వం చిల్డ్రన్ ఆఫ్ చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ధృవీకరణ పత్రాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ ఇంఛార్జి, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఆయనతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, ఇతర ఉన్నతాధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పెద్దల సంరక్షణ కరువైన, పేరెంట్స్ లేని ప్రభుత్వ ,ప్రైవేట్ చిల్డ్రన్ హోమ్స్ లో ఉన్న పిల్లలకు ప్రభుత్వమే…