అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్‌కు బడుగులు, బలహీనులు, దళితులు గుర్తుకు రాలేదన్నారు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవితను పూలే ఇప్పుడు గుర్తుకు వచ్చాడా? బీసీలను ఇన్నిరోజులు ఎందుకు పట్టించుకోలేదన్నారు. కవితను ఒక విషయంపై ప్రశ్నిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. మనకు ఒక ఎంపీ సీటు వస్తుంది అని ఫామ్ హౌజ్ కి వెళ్లి మీ నాన్నకు చెప్పు అని ఆయన అన్నారు. శంకరమ్మకు రాజ్యసభ సీటు ఇవ్వమని అడగండని ఆయన అన్నారు. సీట్లు…
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సమగ్ర కార్యాచరణ కోసం పార్టీ పెద్దలను కలిశామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపు బీజేపీ ఎన్నికల కమిటీ ఢిల్లీలో సమావేశం కానుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉండనుందని, తెలంగాణలో బీజేపీకి అనుకూలంగా ఉందన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారని, బీజేపీ గెలువద్దని కుమ్మక్కు అవుతున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా.. తెలంగాణలో…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ.. 13వ తేదీ రోజు అసెంబ్లీ సమావేశాలు క్లోజ్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినప్పుడు కనీసం 12 రోజులు సమవేశాలు పెట్టాలని మేము అడిగామన్నారు. అవసరం అయితే మరొక సారి 13 వ తేదీ BAC పెడుదామనీ అన్నారు…కానీ అసెంబ్లీ పని రోజులు పెడతామని అని అయితే చెప్పడం లేదన్నారు కడియం…
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీలో మీడియాతో రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కు ఛాంబర్ ఇవ్వాలి ఇచ్చామని, కానీ ఇక్కడే ఇవ్వాలి అని కానీ.. ఇది ఇవ్వద్దు అని లేదన్నారు. గవర్నర్ ప్రసంగానికి కూడా కేసీఆర్ హాజరు కాలేదు. దీంతో ప్రతిపక్ష నేత ఏంటో అందరికీ తెలిసిపోతుంది. బీఏసీకి కూడా రాలేదంటే ఆయన చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. మేడిగడ్డ…
తమిళనాడు రాజధాని చెన్నైలోని కొన్ని పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని గోపాలపురం, జేజే నగర్, ఆర్‌ఏ పురం, అన్నానగర్, పారిస్‌లోని పాఠశాలలక ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి.
పాకిస్థాన్‌లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్-ఎన్, బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, ఇమ్రాన్‌ఖాన్ పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్‌ల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అవినీతి కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉండటం.. పీటీఐ పార్టీ బ్యాట్ గుర్తుపై ఈసీ నిషేధం విధించడంతో షరీఫ్‌కు చెందిన పీఎంఎల్ (ఎన్).. ఈ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది.
కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రి మిలింద్ దేవరా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పగా.. మరో సీనియర్ నాయకుడు బాబా సిద్ధిక్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు
తమ విభేదాలను పక్కనబెట్టి, షెడ్యూల్డ్ కులాల కోటాలో రిజర్వేషన్లు నిరుపేదలు, అత్యంత బలహీన వర్గాలకు రిజర్వేషన్లలో ఎక్కువ వాటాను అందజేస్తాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బుధవారం ఏకగ్రీవంగా సుప్రీంకోర్టుకు తెలిపాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరించాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్రం అభిప్రాయపడింది.
ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో భారత్ చాలా తెలివిగా వ్యవహరిస్తోందని, రష్యాతో సన్నిహితంగా ఉంటోందని రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ అన్నారు. భారత్‌పై బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇమ్రాన్‌ఖాన్ ప్రపంచ క్రికెట్లో అత్యంత శక్తివంతమైన ఆల్రౌండర్లలో ఒకడు. బ్యాట్, బంతితో ఎప్పుడైనా ఆట గమనాన్ని మార్చగల సత్తా అతనికి ఉంది. రిటైర్మెంట్ తర్వాత బంతికి దూరమైన ఆయన నుంచి బ్యాట్‌ను బలవంతంగా లాక్కుంది ఎన్నికల సంఘం.