తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ.. 13వ తేదీ రోజు అసెంబ్లీ సమావేశాలు క్లోజ్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినప్పుడు కనీసం 12 రోజులు సమవేశాలు పెట్టాలని మేము అడిగామన్నారు. అవసరం అయితే మరొక సారి 13 వ తేదీ BAC పెడుదామనీ అన్నారు…కానీ అసెంబ్లీ పని రోజులు పెడతామని అని అయితే చెప్పడం లేదన్నారు కడియం శ్రీహరి. చాలా గ్రామాల్లో తాగు నీటి సమస్య, అధికారికంగా కరెంట్ కోతలు ఉంటున్నాయని, రాష్ట్రంలో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు.
ఆయా నియోజకవర్గాల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా రెచ్చిపోతున్నారని కడియం శ్రీహరి మండిపడ్డారు. కనీసం ప్రోటోకాల్ పాటించకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరుతో ఇచ్చిన 420 హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రశ్నిస్తుందనే భయంతో సమావేశాలను త్వరగా ముగిస్తున్నారని కడియం పేర్కొన్నారు. స్వయంగా సీఎం మాట్లాడుతూ ఓడిపోయిన మా కాంగ్రెస్ అభ్యర్థులు మా ఎమ్మేల్యేలు అని చెప్పడంతో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల విషయం అసెంబ్లీలో మేము ప్రస్తావన కు తీసుకు వస్తామని భయపడి అసెంబ్లీ తొందరగా ముగిస్తున్నారన్నారు కడియం శ్రీహరి.
Sujana Chowdary: చంద్రబాబు-అమిత్ షా-జేపీ నడ్డా భేటీ.. సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు