రెండు నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, గవర్నర్ ప్రసంగంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల గురించి మాట్లాడిస్తారని అనుకున్నామన్నారు ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు, తర్వాత కూడా కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోందన్నారు. గవర్నర్ స్థాయి తగ్గించేలా గవర్నర్ స్పీచ్ సిద్ధం చేశారని ఆయన అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై, తెలంగాణ అప్పులపై ఎక్కడా స్పీచ్ లో లేదని ఆయన పేర్కొన్నారు. అదే గవర్నర్ ప్రసంగంలో సోనియాగాంధీ గురించి గొప్పలు చెప్పించారన్నారు. జాబ్ క్యాలెండర్ తేదీలతో సహా ఎందుకు ప్రకటించలేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారని, ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఎందుకు స్పష్టత ఇవ్వలేకపోయారని నిలదీశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికల సమయంలో మాత్రమే తిట్టుకుంటాయని, కొట్టుకుంటాయని ఆయన పేర్కొన్నారు.
గవర్నర్ ప్రసంగంలో కాళేశ్వరం అవినీతిపై విచారణ గురించి మాట్లాడిస్తే ఇబ్బంది అని భావించి స్పీచ్‌లో పెట్టలేదేమోనంటూ పాయల్ శంకర్ ఎద్దేవాచేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ తీరుపై ప్రశ్నిస్తామని ఆయన పేర్కొన్నారు. రుణమాఫీ ప్రస్తావన కూడా లేదని, అదే గవర్నర్ ప్రసంగంలో సోనియాగాంధీ గురించి గొప్పలు చెప్పించారు.. స్పీచ్ లో ఆమె గురించి పెట్టారన్నారు పాయల్ శంకర్. జాబ్ క్యాలెండర్ తేదీలతో సహా ఎందుకు ప్రకటించలేదని, ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు.. ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఎందుకు స్పష్టత ఇవ్వలేకపోయారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికల సమయంలో మాత్రమే తిట్టుకుంటున్నాయి.. కొట్టుకుంటున్నాయని, గవర్నర్ ప్రసంగంలో కాళేశ్వరం అవినీతిపై విచారణ గురించి మాట్లాడిస్తే ఇబ్బంది అని భావించి స్పీచ్ లో పెట్టలేదనుకుంటామని, అసెంబ్లీలో కాంగ్రెస్ తీరుపై ప్రశ్నిస్తామన్నారు పాయల్ శంకర్.