అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్‌కు బడుగులు, బలహీనులు, దళితులు గుర్తుకు రాలేదన్నారు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవితను పూలే ఇప్పుడు గుర్తుకు వచ్చాడా? బీసీలను ఇన్నిరోజులు ఎందుకు పట్టించుకోలేదన్నారు. కవితను ఒక విషయంపై ప్రశ్నిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. మనకు ఒక ఎంపీ సీటు వస్తుంది అని ఫామ్ హౌజ్ కి వెళ్లి మీ నాన్నకు చెప్పు అని ఆయన అన్నారు. శంకరమ్మకు రాజ్యసభ సీటు ఇవ్వమని అడగండని ఆయన అన్నారు. సీట్లు ఎవరెవరికి అమ్ముకున్నారో అందరికీ తెలుసునని, మీ నాన్న ఆరోగ్యం ఎలాగూ బాగోలేదు కదా.. కాబట్టి ఫ్లోర్ లీడర్ గా సీనియర్ అయిన, దళితుడు అయిన కడియం కు ఇవ్వండని రఘునందన్ రావు అన్నారు. మీ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలాగూ రాజ్యాలు విస్తరించుకునే పనిలో ఉన్నాడని, ఆయనకు సినిమా వాళ్ళతో పనులుంటాయన్నారు.
Lal Salaam: సౌండ్ లేకుండా దిగుతున్న రజనీకాంత్ సినిమా
కాబట్టి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒక బీసీ కి ఇవ్వండని, శంకరమ్మకు రాజ్యసభ సీటు ఇచ్చి మీ పాపాలు కడుక్కోండన్నారు. నీకు, మీ ఫ్యామిలీకి ఇంకా పబ్లిసిటీ పిచ్చి ఎందుకు అని ఆయన విమర్శించారు. శాసనసభలో మీ అన్న, మీ బావ కనపడాలి.. తెలంగాణ భవన్ లో మీ తండ్రి కనపడాలి.. మండలిలో నువ్వు కనిపిస్తావని, మీరు తప్ప మాట్లాడే వాళ్ళు మీ పార్టీలో లేరా అని ఆయన ప్రశ్నించారు. మీ అయ్య కాళ్ళు మొక్కుతావో.. ఏం చేస్తావో తెలియదు కాని.. కొద్దిరోజులు మీరు, మీ కుటుంబ సభ్యులు మాట్లాడకుండా, మీడియా ముందుకు రాకుండా ఉంటే మీకే మంచిదన్నారు. చెల్లి.. నువు ఉన్నా లేకున్నా పూలే గుర్తుంటారు.. మీరు కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదన్నారు. మీ పార్టీ పేరులో ఎలాగూ తెలంగాణ పోయిందని, కనీసం సీట్లు అయినా తెలంగాణ కోసం కొట్లాడిన వారికి ఇవ్వండన్నారు రఘునందన్ రావు.
Ram Charan: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో చరణ్ సినిమా.. రికార్డులు బద్దలు కావడం ఖాయమే..?