Bomb Threats: తమిళనాడు రాజధాని చెన్నైలోని కొన్ని పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని గోపాలపురం, జేజే నగర్, ఆర్‌ఏ పురం, అన్నానగర్, పారిస్‌లోని పాఠశాలలక ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌లతో పాఠశాలలకు చేరుకున్నారు.
Read Also: Pakistan Elections 2024: పాక్‌లో కొనసాగుతున్న పోలింగ్.. మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
ఈ పాఠశాలల్లోని విద్యార్థులను వారి తల్లిదండ్రులను పిలిపించి తిరిగి ఇంటికి పంపించారు. ఈ విషయం తెలియగానే పిల్లల తల్లిదండ్రులు పరుగుపరుగున వచ్చి పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రజలు భయాందోళన చెందవద్దని, ఈమెయిల్స్ పంపిన నిందితుడిని గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. చెన్నైలోని ఐదు ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలకు ఓ అనామక వ్యక్తి ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు పంపడంతో కలకలం రేగింది. ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు పంపిన వ్యక్తిని కనుగొనడానికి ఆపరేషన్ ప్రారంభించబడింది.