వివాదాస్పద దర్శకుడు వర్మ నుంచి వచ్చిన సినిమా యాత్ర2.. యాత్ర 2 చిత్రం ఫిబ్రవరి 8న థియేటర్లోకి వచ్చింది. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. కొంత మంది ప్రజా ప్రతినిధులకు బుధవారం రోజున షోలు వేశారు. అలా యాత్ర 2 టాక్ ఇప్పుడు బయటకు వచ్చింది.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.. ముఖ్యంగా ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది అని చెప్పడంలో సందేహం లేదు.. ఈ సినిమా టాక్ ఎలా ఉందో,జనాలు ఏమంటున్నారో ఒకసారి…
హైదరాబాద్ నగరంలో ఎన్ఐఏ సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే నగరంలో పలు చోట్ల కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సోదాలు చేస్తుంది. నేటి తెల్లవారుజాము నుంచే సీనియర్ జర్నలిస్ట్, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
ఐకానిక్ లూయిస్ విట్టన్ OnTheGo టోట్ నుండి ప్రేరణ పొందిన మైక్రోస్కోపిక్ హ్యాండ్‌బ్యాగ్ అద్భుతమైన ధరకు ($63,750 )విక్రయించబడింది, ఇది సుమారు రూ. 51.7 లక్షలు.. ఈ సూక్ష్మ కళాఖండాన్ని ఆర్ట్ కలెక్టివ్ MSCHF రూపొందించింది.. ఇది కేవలం 657 బై 222 బై 700 మైక్రోమీటర్‌లను కొలుస్తుంది, ఇది ఉప్పు ధాన్యం కంటే చిన్నదిగా చేస్తుంది.. చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ, హ్యాండ్‌బ్యాగ్ ఒక సూక్ష్మదర్శిని క్రింద మాత్రమే మెచ్చుకోదగిన అద్భుతమైన స్థాయి వివరాలను కలిగి ఉంది.…
రానున్న 15రోజుల్లో 15 వేల పోలీసుల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. 64 కొత్త ఖాళీలతో గ్రూప్ -1 నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామన్నారు. రాష్టంలోని 30 లక్షల నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్దం కావాలని ఆయన సూచించారు. తమ ప్రభుత్వం ఉద్యోగాల నియామకాల కోసం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సింగరేణి సంస్థను అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. సింగరేణిలో…
ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ సమక్షంలో తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈవో ఎస్.ఎన్.రెడ్డి, ఎన్.ఆర్.ఎస్సీ డైరెక్టర్ ప్రకాష్ చౌహన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజుతో పాటు…
శాసన సభ సమావేశాలు- నిర్వహణ, భద్రతా ఏర్పాట్ల పై సమీక్ష చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా, సమావేశాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై శాసన సభ మీటింగ్ హాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్బంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ…
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయ్యిందన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ఇవాళ ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి నెలలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారన్నారు. ఆరోగ్య శ్రీ 15 లక్షలు పెంచారని, రూ. 500 కె సిలిండర్, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ త్వరలోనే ప్రారంభం కానుందన్నారు జగ్గారెడ్డి. సోనియాగాంధీ.. రాహుల్ గాంధీల నిర్ణయం మేరకు పథకాల అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 9 ఏండ్లలో మంత్రులు..…
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో రూ.26 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖను ప్రక్షాళన చేస్తామన్నారు. అధికారంలోకి రాగానే ఆరోగ్య శ్రీ పతకాన్ని రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచామని ఆయన తెలిపారు. రెడ్ల…
పార్లమెంట్లో మోడీ ప్రసంగంలో కాంగ్రెస్ పై చేసిన వాఖ్యలు చర్చ జరుగుతోందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నెహ్రూ, ఉద్యోగాలు, రిజర్వేషన్లపై చేసిన మాటలు అని, ప్రధాని ఉభయసభల్లో బయట పెట్టారన్నారు. మండల కమిషన్ ను రాజీవ్ గాంధీ అడ్డుకున్నారని, అంబేడ్కర్ ను కాంగ్రెస్ ఓడించింది.. ఇబ్బంది పెట్టిందన్నారు లక్ష్మణ్. కాంగ్రెస్ వాస్తవాలు బయట పెట్టారు ప్రధాని అని, పది సంవత్సరాల యూపీఏ పాలన, పదేళ్ల ఎన్డీయే పాలన పోల్చి చూడాలన్నారు. ఎన్నో…