బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీలో మీడియాతో రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కు ఛాంబర్ ఇవ్వాలి ఇచ్చామని, కానీ ఇక్కడే ఇవ్వాలి అని కానీ.. ఇది ఇవ్వద్దు అని లేదన్నారు. గవర్నర్ ప్రసంగానికి కూడా కేసీఆర్ హాజరు కాలేదు. దీంతో ప్రతిపక్ష నేత ఏంటో అందరికీ తెలిసిపోతుంది. బీఏసీకి కూడా రాలేదంటే ఆయన చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. మేడిగడ్డ మీద చర్చ పక్కదారి పెట్టడానికి krmb ఇష్యు తీసుకుంటున్నారు కేసీఆర్ అని ఆయన విమర్శించారు. . నీ ఆధీనంలో ఉన్న నాగార్జున సాగర్ మీదికి జగన్ తుపాకులు పంపి గుంజుకునే పని చేశారని, మూడు రోజులు పోలీసులు ఉన్నారన్నారు. అప్పుడు నువ్వు ఎక్కడ పడుకున్నావు అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతీ రోజు 12 టీఎంసీ నీళ్లు రాయలసీమకు తరలించే పని చేసింది.. కేసీఆర్ కాదా..? అని ఆయన ప్రశ్నించారు.
Eagle: ఈగల్ ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత రాబట్టాలంటే?
రోజా పెట్టిన చేపల పులుసు తిని రాయల సీమకు రత్నాలు చేస్తా అన్నారన్నారు. కేసీఆర్ కమిట్ మెంట్ ప్రజలకు కూడా అర్థమైందని, కృష్ణ బేసిన్ లో ప్రజలు ఆయనకు ఎన్ని సీట్లు వచ్చాయన్నారు. కేసీఆర్ కమిట్ మెంట్ మీద ఎవడికైనా డౌట్ ఉందంటే.. హరీష్‌కే ఉందన్నారు. కేసీఆర్ వచ్చినా కలుస్తా అని ఆయన వ్యాఖ్యానించారు. సోనియాగాంధీ ని తెలంగాణ నుండి పోటీ చేయాలని కోరామన్నారు. కేసీఆర్ కాలం చెల్లిన మెడిసిన్.. అధికారం కోల్పోయిన అసహనం తో మట్లాడుతున్నారు. మనుగడ కోసం.. మట్లాడుతున్నారు. బేసిన్ లు లేవు భేషజాలు లేవని కేసీఆర్ ఆయన కమిట్ మెంట్ కృష్ణా బేసిన్ లో బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించారు. సీఎంగా నేను కేసీఆర్ ను కూడా కలుస్తా. విజయసాయి రెడ్డి.. ఒక నాన్ సీరియస్ పొలిటీషియన్. అలాంటి వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.