ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష సరైంది కాదని, ఆయన మాట్లాడే భాష పై సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయాలన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా తో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఉన్మాద భాష మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. 90 రోజుల నుండి రేవంత్ రెడ్డి మాట్లాడే భాష పై …రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, బొంద పెడతాం, మానవ బాంబులు అయితాం, పండబెట్టి తోక్కుతాం అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు…
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో సంస్కరణలకు కృషి చేశారన్నారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయన గాంధీ కుటుంబంతో, కాంగ్రెస్ పార్టీతో కొనసాగారని ఆయన వ్యాఖ్యానించారు. జగ్జీవన్ రామ్ స్పూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి మా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు విడి విడిగా…
సికింద్రాబాద్ అల్వాల్ టిమ్స్ సమీపంలో రాజీవ్ రహదారి(SH01) ఎలివేటెడ్ కారిడార్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాజీవ్ రహదారి ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్, కుత్బుల్లాపూర్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రయాణం సులభతరం అవుతుందని ఆయన తెలిపారు.
హీరో సుహాస్ పేరుకు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు.. ఈ మధ్య రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి.. షార్ట్ ఫీలిమ్స్ చేస్తూ సినిమాల్లో అవకాశాలు అందుకున్న సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. హీరోగా చేస్తూనే క్యారెక్టర్, నెగెటివ్ పాత్రలు చేస్తూ ట్యాలెంటెడ్ యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. అలాగే గత ఏడాది రైటర్ పద్మభూషణ్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు..…
సాహితీ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు షాక్ ఇచ్చారు. రూ.200 కోట్ల ఆస్తులను సీజ్ చేశారు సీసీఎస్ పోలీసులు. సాహితీ పార్టనర్స్‌తో పాటు సంస్థ ఉద్యోగులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ స్కాంతో సంబంధం ఉన్న, రాజకీయ నాయకులకు, బడా వ్యాపారులకు ఉచ్చు బిగుస్తోంది.
బుధవారం సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్‌లో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి తిట్టాలి అంటే చంద్రబాబుని తిట్టాలి.. నిందించాలి అంటే కాంగ్రెస్ పార్టీని నిందించాలని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ లోపాలు, చంద్రబాబు పాపాలు.. మహబూబ్ నగర్‌కి శాపాలు అంటూ ఆయన విమర్శించారు.
పాకిస్థాన్‌లో జరిగే మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు 62 మంది హిందువులు బుధవారం భారత్ నుంచి వాఘా సరిహద్దు మీదుగా లాహోర్ చేరుకున్నారు. మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి బుధవారం నాడు మొత్తం 62 మంది హిందూ యాత్రికులు లాహోర్ చేరుకున్నారని ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు (ఈటీపీబీ) ప్రతినిధి అమీర్ హష్మీ తెలిపారు.
హీరో సుహాస్.. ఈ పేరుకు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు.. మొదట షార్ట్ ఫీలిమ్స్ చేస్తూ సినిమాల్లో అవకాశాలు అందుకున్న సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. హీరోగా చేస్తూనే క్యారెక్టర్, నెగెటివ్ పాత్రలు చేస్తూ ట్యాలెంటెడ్ యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. అలాగే గత ఏడాది రైటర్ పద్మభూషణ్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇటీవల అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ తో ప్రేక్షకులను పలకరించాడు..…
విద్యుత్ సరఫరాలో తెలంగాణ డిస్కంలు కొత్త రికార్డు సృష్టించాయి. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు డిస్కంల పరిధిలో మార్చి 6 వ తేదీన 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో నేటి నుంచి మహశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలను నిర్వహించనున్నారు.