హీరో సుహాస్ పేరుకు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు.. ఈ మధ్య రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి.. షార్ట్ ఫీలిమ్స్ చేస్తూ సినిమాల్లో అవకాశాలు అందుకున్న సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. హీరోగా చేస్తూనే క్యారెక్టర్, నెగెటివ్ పాత్రలు చేస్తూ ట్యాలెంటెడ్ యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. అలాగే గత ఏడాది రైటర్ పద్మభూషణ్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇటీవల అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ తో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..
సుహాస్ హీరోగా పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా.. వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేతా.. పలువురు ముఖ్య పాత్రల్లో కొత్త దర్శకుడు అర్జున్ దర్శకత్వంలో లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్ పై మణికంఠ, ప్రసాద్ రెడ్డి నిర్మాతలుగా ఈ ప్రసన్న వదనం సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.. సరి కొత్త కాన్సెప్ట్ తో సినిమా రాబోతుందని టీజర్ ను చూస్తే అర్థమవుతుంది..
ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. టీజర్ చూస్తుంటే సినిమా క్రైం థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో సుహాస్ కి ఎవరి ఫేస్ సరిగ్గా కనపడని, గుర్తుపట్టలేని.. ఫేస్ బ్లైండ్ నెస్ అనే జబ్బు ఉన్నట్టు చూపించారు.. ఈ సినిమాతో కూడా హిట్ ట్రాక్ ను కంటిన్యూ చేస్తారేమో చూడాలి.. ఈ సినిమా కూడా హిట్ అయితే సుహాస్ స్టార్ హీరో అయినట్లే అని ఆయన ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు..