హీరో సుహాస్.. ఈ పేరుకు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు.. మొదట షార్ట్ ఫీలిమ్స్ చేస్తూ సినిమాల్లో అవకాశాలు అందుకున్న సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. హీరోగా చేస్తూనే క్యారెక్టర్, నెగెటివ్ పాత్రలు చేస్తూ ట్యాలెంటెడ్ యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. అలాగే గత ఏడాది రైటర్ పద్మభూషణ్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇటీవల అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ తో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా కూడా సాలిడ్ హిట్ ను అందుకుంది..
కొత్త డైరెక్టర్ దుష్యంత్ కటికనేని తెరకెక్కించిన ఈ విలేజ్ ఎమోషనల్ డ్రామాలో శివాని నగరం హీరోయిన్ గా నటించింది. అలాగే ఫిదా ఫేమ్ శరణ్యా ప్రదీప్ మరో కీలక పాత్ర పోషించింది. జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ ను నిర్మించాయి..ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. మంచి విజయాన్ని అందుకుంది.. సుహాస్ ఈ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు..
ఇక థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది..ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సుహాస్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. మార్చి 1 నుంచి ఆహాలో అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ మోగుతుంది… అయితే తొలి ఐదు రోజుల్లోనే ఈ సినిమాకు ఆహా ఓటీటీలో 10 కోట్ల నిమిషాల మార్క్ అందుకోవడం విశేషం. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ వెల్లడించింది.’ మా ఊరు అంబాజీపేట.. 10 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలు, అయినా ఆగదు మా పాటఅనే క్యాప్షన్ తో ఆహా ఓటీటీ ఈ విషయాన్ని షేర్ చేసింది.. ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది..