టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన కొత్త సినిమా భీమా.. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లు. కన్నడ దర్శకుడు ఎ హర్ష తెరకెక్కించిన చిత్రమిది. ‘పంతం’ తర్వాత గోపీచంద్ హీరోగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ అధినేత కెకె రాధామోహన్ ప్రొడ్యూస్ చేసిన సినిమా.. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్స్, టీజర్స్ సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి.. శివరాత్రి కానుకగా ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది..…
ఎన్నికల వేళ ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడంపై స్పష్టత రాకున్నా వైసీపీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
నేడు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు, జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో అన్ని రకాల సంఘాల నేతలతో సమావేశం కానున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి మాజీ మంత్రి కేటీఆర్, తుల ఉమా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ.. మీటింగ్ ఆలస్యం అయినా, మనం ఓడిపోయిన గుండె, ధైర్యంతో ఓపిక తో కూర్చున్న మీకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానన్నారు. రైతులు అంటున్నారు, కేసీఆర్‌ను ఓడగొట్టుకొని తప్పు చేశాం అర్థ రాత్రి కరెంట్ మోటార్లు వేసుకొనే పరిస్థితి వచ్చిందన్నారు కేటీఆర్. డిసెంబర్ 3న కేసీఆర్ ముఖ్య…
రాష్ట్రంలోని ఐటీఐ కాలేజీలను అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా (స్కిల్లింగ్ సెంటర్లు) తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగు ముందుకేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 65 ప్రభుత్వ ఐటీఐ కాలేజీల్లో స్కిల్లింగ్ సెంటర్ల ఏర్పాటుకు టాటా టెక్నాలజీస్ తో ఎంవోయూ కుదుర్చుకుంది. శనివారం సచివాలయంలో టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో అధికారులు ఎంవోయూ పత్రాలపై సంతకాలు చేశారు. ప్రభుత్వ…
ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్‌కు మెట్రోను పొడిగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ వద్ద బైరామల్ గూడ కూడలిలో నిర్మించిన వంతెనను శనివారం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్ లో చేదు అనుభవం ఎదురైనా…మీరు నన్ను ఆదరించారన్నారు. ఎల్బీ నగర్ లో నాకు 30 వేల మెజార్టీ ఇచ్చి మల్కాజిగిరి ఎంపీ గా గెలిపించారన్నారు. మీ అభిమానం తోనే తెలంగాణ కు ముఖ్యమంత్రి అయ్యానని, ఎల్బీ నగర్ కు…
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీతో చెట్ట పట్టాలు వేసుకోని తిరుగుతున్నాడని, పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే రేవంత్ రెడ్డి బీజేపీలోకీ వెళ్తాడంటూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలు చేశారు. మోడీనీ పెద్దన్న అన్నప్పుడే తెలిసిపోయిందని, మోడీ అపాయింట్ మెంట్ రేవంత్ రెడ్డికీ ఈజీగా దొరుకుతుందన్నారు బాల్క సుమన్. పార్లమెంట్ ఎన్నికల ముగియగానే రేవంత్ రెడ్డి మరో ఏక్ నాథ్ షిండే , హేమంత్ బిశ్వశర్మ కావడం ఖాయమన్నారు బాల్క సుమన్. బేగంపేట విమానాశ్రయంలో గురు…
రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఇవ్వనటువంటి విద్యుత్ నీ రాష్ట్ర ప్రజలకు అందించామని, రాష్ట్రంలో నిన్న విద్యుత్ 15623 మెగావాట్ల వినియోగం అయ్యిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో 15497 మెగావాట్ల విద్యుత్ (30.03.2023న) నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ సరఫరా చేశామని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ విద్యుత్ సరఫరా చేశామని ఆయన వెల్లడించారు. గత పాలకులు వాస్తవాలు పక్కన…
మార్చి 14 నుండి మార్చి 17 వరకు కేంద్ర సాంస్కృతిక శాఖ, గైడ్ ఆఫ్ హార్ట్ఫుల్నెస్ ఆధ్వర్యం లో గ్లోబల్ స్పిరుచువాలిటీ మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వసుధైక కుటుంబం థీమ్ తో మహోత్సవమని, కన్హా శాంతి వనం లో కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మార్చి 15 న రాష్ట్రపతి ప్రారంభిస్తారని, మార్చి 16 న ఉప రాష్ట్రపతి పాల్గొంటారని ఆయన…