రైతులు కష్టాలు తీరాలంటే చంద్రబాబుకు పట్టం కట్టాలని, రైతును దగా చేసిన సీఎం జగన్ పాలనకు చరమగీతం పాడాలని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టిడిపి నాయకులు డాక్టర్ మాచాని సోమనాథ్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన ఎమ్మిగనూరు పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నందు గల కూరగాయల వేలం మార్కెట్ నందు,ఎద్దుల మార్కెట్ యందు, మేకల బజార్ లో తిరిగి బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ పై ప్రచారం నిర్వహించారు. రైతులను కలుసుకొని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, బాధలను విన్నారు.…
కామారెడ్డి – కామారెడ్డి బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్దాయి సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కామారెడ్డి ఎన్నిక చేదు అనుభవం మిగిల్చింది. ఆ ఎన్నికల పై చర్చ వద్దు, జరిగింది జరిగిపోయిందన్నారు. గంప గోవర్ధన్ నాయకత్వంలో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తామని, త్వరలో బీఆర్ఎస్ కు పూర్వ వైభవం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తినే పల్లెంలో మట్టిపోసుకున్నాం అనే భావన సామన్య ప్రజల్లో , రైతుల్లో ఉందని,…
కామారెడ్డి – జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్దాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ 420 హామీల్లో ఇప్పటికి అమలైంది ఉచిత బస్సు మాత్రమే, అది సక్రమంగా అమలు కావడం లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నేతలు కొండంత హామిలు ఇచ్చి ..గోరంత పనులు చేయడం లేదని, కేసీఆర్ పథకాలు ఒక్కటి కూడా…
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలు అంతా నారీశక్తిని నిరూపించాలని పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా ఆదివారం హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మహిళా మోర్చా కార్యవర్గ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా మహిళా మోర్చ కార్యాచరణను వివరించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించు కొని తెలంగాణ వ్యాప్తంగా వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన మహిళలను ఘనంగా సన్మానించి మెమోంటోలు…
ఈనెల 11 నుండి 21 వరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 11న(రేపు) స్వస్తి వచనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు బ్రహ్మోత్సవాలలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం పాల్గొననున్నారు.
బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద చివరి సిద్ధం సభ గురించి మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. చివరి సిద్ధం సభ సూపర్ సక్సెస్ అవుతుందని ఆయన అన్నారు. 15 లక్షలకు మించి ప్రజలు హాజరవుతారన్నారు. ఈ సభ మాకు ఎన్నికల ప్రచారం లాంటిదన్నారు.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో ఓ మైనర్ బాలికపై, 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసినట్లు నేరేడుచర్ల ఎస్సై రవీందర్ నాయక్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్లకు చెందిన 14 ఏళ్ల బాలికపై ఇదే పట్టణానికి చెందిన షేక్ సుబాని(45) అత్యాచారం చేసి పరారైనట్లు ఆయన తెలిపారు.
టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన మూవీ గామి.. చాందిని హీరోయిన్ గా నటించింది.. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపించాడు విశ్వక్..దర్శకుడు విద్యాధర్ కటిగ ఈ సినిమాను చాలా చక్కగా తెరాకెక్కించారు.. ఈ చిత్రం కోసం అతడు ఆరేళ్లుగా పని చేస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ శివరాత్రి కానుకగా విడుదల అయ్యింది.. మొదటి షో తోనే మంచి టాక్ ను అందుకుంది.. ఇక టీజర్, ట్రైలర్స్ గామి సినిమా…
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. బీజేపీ కూడా పొత్తులపై క్లారిటీ ఇవ్వడంతో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీజేపీ కూడా ఇప్పటి నుంచి ప్రచారంలో దూసుకుపోయేందుకు సిద్ధమైంది.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తన వైసీపీ చేరికపై స్పష్టత ఇచ్చారు. ఆయనే స్వయంగా స్పందించారు. ఈనెల 14న వైసీపీలో చేరుతున్నానని ముద్రగడ పద్మనాభం చెప్పారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు వైఎస్సార్సీపీలో చేరుతున్నానని వెల్లడించారు.