తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీతో చెట్ట పట్టాలు వేసుకోని తిరుగుతున్నాడని, పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే రేవంత్ రెడ్డి బీజేపీలోకీ వెళ్తాడంటూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలు చేశారు. మోడీనీ పెద్దన్న అన్నప్పుడే తెలిసిపోయిందని, మోడీ అపాయింట్ మెంట్ రేవంత్ రెడ్డికీ ఈజీగా దొరుకుతుందన్నారు బాల్క సుమన్. పార్లమెంట్ ఎన్నికల ముగియగానే రేవంత్ రెడ్డి మరో ఏక్ నాథ్ షిండే , హేమంత్ బిశ్వశర్మ కావడం ఖాయమన్నారు బాల్క సుమన్. బేగంపేట విమానాశ్రయంలో గురు శిష్యుల భేటీ రెండు గంటల పాటు జరిగిందీ… రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు బేగంపేట విమానాశ్రయంలో కలుసుకున్నారని, చంద్రబాబు నాయుడు మోడీకి హామీ ఇచ్చాడు…. రేవంత్ రెడ్డి మా శిష్యుడే మీరూ ఒకే అంటే బీజేపీలోకీ తీసుకోని వస్తాననీ అని బాల్క సుమన్ ఆరోపించారు. గురు శిష్యుల బంధం బీజేపీకి కోసం కృషి చేస్తున్నాయని, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్న….. చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కరువు వచ్చిందన్నారు.
రేవంత్ రెడ్డి మనుషులను తీసుకోని తొందరలోనే బిజెపిలోకీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడని, 2019 లో పార్లమెంట్ ఎన్నికల్లో టిడిపి ఓటమీ తరువాత ఆయన అనుచరులు బిజెపిలోకి పంపించాడు…. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డినీ బిజెపిలోకి పంపించేందుకు రెడీగా ఉన్నాడన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బిజెపికి వేసినట్లేనన్నారు. గురువు చంద్రబాబు ఆదేశాల మేరకే 2014లో తాము అధికారంలోకి వచ్చాక తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని రేవంత్ రెడ్డి కుట్రలు చేశారని ఆరోపించారు. అంతకుముందు ఉద్యమం సమయంలో చంద్రబాబు ఆదేశాల మేరకు రైఫిల్ పట్టుకున్నారన్నారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఎంత చెబితే అంత అన్నారు. తెలంగాణ ప్రజలకు తాను చేసే విజ్ఞప్తి ఒక్కటేనని… కాంగ్రెస్, టీడీపీ కుట్రలను గుర్తించాలని కోరారు.