టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు వరుస సినిమాలను నిర్మించడమే కాదు అనుకున్న టైం కు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాడు.. ప్రస్తుతం అర డజనుకు పైగా సినిమాలను నిర్మిస్తున్నారు. రామ్ చరణ్, శంకర్ ల గేమ్ చేంజర్ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ఇంకా పలు సినిమాలు నిర్మిస్తున్నాడు.. వచ్చే నెలలో ఏకంగా రెండు సినిమాలను రిలీజ్ చేయబోతున్నాడు.. ఈ సినిమాల్లో ఒకటి ఆయన ఇంటి వారసుడు ఆశీష్ హీరోగా రూపొందుతున్న లవ్…
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కరెంట్ కష్టాలు ఏర్పడుతున్నాయని కొన్ని మీడియా సంస్థలలో రావడాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఖండించారు. కొన్ని మీడియా సంస్థలు కావాలని విమర్శనాత్మకంగా చిత్రీకరించాయని ఆయన మండిపడ్డారు. నిన్న జగిత్యాలలో జరిగిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం గురించి రెవెన్యూ అధికారులు విద్యుత్ శాఖకు తెలుపకపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడిందని, ప్రతి రెండవ శనివారం రోజున చేపట్టే మరమ్మత్తులకై అధికారులు విద్యుత్తు సరఫరా నిలిపి వేశారన్నారు. అధికారులు సమన్వయ లోపంతో ఏర్పడ్డ అంతరాయాన్ని…
ఎంసీహెచ్ఆర్డీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్లుగా మీ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం రాలేదు.. ఆవేదన వినేవారు లేక ఇబ్బందులు పడ్డారన్నారు. మీ సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో పొందుపరిచిందని, వాటిని పరిష్కరించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇన్నాళ్లు సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా ఉన్నది, అధికారంలో ఉన్నది కేసీఆర్ కుటుంబమేనని, నిర్బంధాలతో పాలన సాగిస్తామనుకోవడం వారి భ్రమ…
ఇటీవల చిన్న సినిమాగా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి.. అంతేకాదు బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ కలెక్షన్స్ ను అందుకుంటున్నాయి.. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో సినిమా కూడా దూసుకుపోతుంది.. టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన మూవీ గామి.. చాందిని హీరోయిన్ గా నటించింది.. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపించాడు విశ్వక్.. దర్శకుడు విద్యాధర్ కటిగ ఈ సినిమాను చాలా చక్కగా తెరాకెక్కించారు..…
టాలివుడ్ ముద్దుగుమ్మ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ప్లాప్ సినిమాలు ఒకవైపు పలకరిస్తున్నా కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.. ఇక సోషక్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది.. తాజాగా బాలీవుడ్ లో బంఫర్ ఆఫర్ కొట్టేసింది.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.. ఈ అమ్మడు ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో ఫుల్ బిజీగా…
తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి మూడు నెలల అవుతోందన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. మూడు నెలల అనేది తక్కువ కాలం కాదన్నారు. మార్పు తెస్తామని ప్రజలకు చెప్పితే…. ప్రజలు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చారన్నారు. మార్పు మాత్రం తీరోగమనంలా ఉన్నదని, బీఆర్ఎస్ పాలనలో పొందిన అనేక అవకాశాలు ఇవ్వాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోల్పోతున్నారన్నారు. పల్లెల్లో, పట్టణాల్లో నీళ్ళు లేక ట్యాంకర్ల కోసం ఎదురుచూస్తున్నారని, కేసీఆర్ మీదా నమ్మకంతో…
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ గారిని గత ప్రభుత్వ పాలన లో విడుదల చేసిన 317 జీవో ద్వారా ఇబ్బందులు ఎదుర్కుంటున్న బాధితులు హైదరాబాదులోని తన నివాసంలో కలిశారు. తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా 317 జీవో బాధితులు మంత్రి దామోదర్ రాజనర్సింహ గారికి తమ సమస్యల పరిష్కారం పై రూపొందించిన వినతి పత్రాన్ని సమర్పించారు. గత ప్రభుత్వం నిరంకుశంగా, అసంబద్ధ…
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల బీ.ఆర్.ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తుమ్మిడి, బమ్మిడి చేసి అడ్డగోలుగా అబద్ధాలు చెప్పి 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. సీఎం మెడల పేగులు వేసుకుంటా అని అంటున్నాడు బోటి పేగులు కొడుతున్నాడా ఇప్పటి నుండి రేవంత్ రెడ్డి పేరు పొంగనాలు రేవంత్ రెడ్డి అని అంటున్నారన్నారు. సీఎం నువ్వు మోగినివైతే ఇవ్వాళ జివో తీసి…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ స్పందించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను పట్టుకొని మల్కాజిగిరికి ఈటల రాజేందర్ కు సంబంధం ఏంటి అని అడుగుతున్నాడు. ఈటల రాజేందర్ అనేటోడు ఒక కులానికో, ప్రాంతానికో, మతానికి సంబంధించిన బిడ్డ కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ 22 సంవత్సరాల కాలంలో తెలంగాణ మట్టిబిడ్డగా, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చిన బిడ్డను అని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరి మీద…
న్యాయపరమైన చిక్కులను తొలగించి ఉపాధ్యాయుల బదిలీలు,పదోన్నతుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర విస్తృత కమిటీ సమావేశం డిమాండ్ చేసింది. రెండవ రోజు హైదరాబాద్ లోని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కే .జంగయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కే జంగయ్య , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి లు ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కే జంగయ్య మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన రాష్ట్ర…