టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన కొత్త సినిమా భీమా.. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లు. కన్నడ దర్శకుడు ఎ హర్ష తెరకెక్కించిన చిత్రమిది. ‘పంతం’ తర్వాత గోపీచంద్ హీరోగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ అధినేత కెకె రాధామోహన్ ప్రొడ్యూస్ చేసిన సినిమా.. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్స్, టీజర్స్ సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి.. శివరాత్రి కానుకగా ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. మంచి టాక్ తో దూసుకుపోతుంది..
ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నీవేశాలు ఉన్నాయని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.. ఈ సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ అండ్ క్లైమాక్స్ అదిరిపోయాయట. మరీ ముఖ్యంగా కమర్షియల్ హంగులతో పాటు సినిమాలో కంటెంట్ కూడా బావుందని చెబుతున్నారు. ‘భీమా’తో గోపీచంద్ హిట్ ట్రాక్ ఎక్కేశారని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. సినిమాలోని యాక్షన్ హైలెట్ అని చెబుతున్నారు.. ఇక తాజాగా సినీ నటుడు నరేశ్ ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు..
ఈ సినిమా సక్సెస్ అయ్యినందుకు యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమంలో వీకే నరేశ్ మాట్లాడుతూ.. చాలా మంది ప్రేక్షకులు భీమా చూసి ఇంటర్వెల్ ఎక్సలెంట్, క్లైమాక్స్ బ్లాక్ బస్టర్ అని మెసేజ్ పెట్టారు. ప్రతి సినిమాకి ఈ రెండు చాలా కీలకం. ఇందులో విజయం సాధించిన దర్శకుడు హర్షకి అభినందనలు. సంక్రాంతి సినిమాల శివరాత్రి సినిమా ఉంటుంది. భీమా శివరాత్రి సినిమా. థియేటర్స్ దద్దరిల్లాయి. రెండు పాత్రలు పండించడం చాలా కష్టం. గోపీచంద్ గారు చాలా అద్భుతంగా పండించారు. గోపీచంద్‌కి హ్యాట్సాఫ్ అని అన్నారు.. సినిమా జనాలకు చాలా బాగా రీచ్ అయ్యిందని ఆయన అన్నారు..ఆయన స్పీచ్ హైలెట్ గా నిలిచింది.. ప్రస్తుతం ఈ సినిమా దూసుకుపోతుంది..