ఎన్నికల బాండ్లవివరాల వెల్లడికి ఎస్బీఐ అదనపు సమయం కోరడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత ఎన్నికల కమిషన్‌కు అన్ని ఎలక్టోరల్ బాండ్ లావాదేవీల వివరాలను అందించడానికి అదనపు సమయం కావాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.
టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది.. ప్రముఖ దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూశారు.. తెలుగులో సత్యం సినిమాతో పరిచయమైన డైరెక్టర్ ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పచ్చ కామెర్లు రావడంతో ఇవాళ తుది శ్వాస విడిచారు.. ఆయన మరణం పై సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.. ఈయన మాస్టర్ సురేష్ పేరుతో దాదాపుగా 200లకు పైగా సినిమాల్లో బాలనటుడిగా, సహాయ నటుడిగా నటించారు.. ‘రాక్షసుడు’, ‘దొంగమొగుడు’,…
జగిత్యాల పట్టణం లో ని మార్కండేయ టెంపుల్ అవరణలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ నుండి మున్సిపల్ చైర్మన్ జ్యోతి, ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ లో కి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం వచ్చి ఉంటే కేసీఆర్ తెలంగాణ ను ఆంధ్రప్రదేశ్ కు తాకట్టు పెట్టావాడని విమర్శించారు. కృష్ణ నది జలాల కేటాయింపు కోసం ఆంధ్ర తో యుద్దానికైనా సిద్ధమని, పదవి వచ్చిన రాకపోయినా నేను జగిత్యాల…
భద్రాద్రి రామయ్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రుల బృందం దర్శించుకుంది. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి తోపాటు మంత్రులకు పూర్ణకుంభంతో ఎండోమెంట్ కమిషనర్,ఈవో , అర్చకులు,వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలో మూలమరుల వద్ద ముఖ్యమంత్రి , క్యాబినెట్ మంత్రుల బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి, మంత్రుల బృందానికి స్వామివారి తీర్థప్రసాదాలు, స్వామివారి జ్ఞాపికతో పాటు వేదాశీర్వచనం అందించారు వేద పండితులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి,మంత్రులు కోమటిరెడ్డి,…
సినిమా షూటింగ్ లకు వైజాగ్ చాలా బాగుంటుంది.. అందుకే ఎక్కువగా సినిమాలు అక్కడే చిత్రీకరిస్తారు.. ప్రస్తుతం వైజాగ్ లో ఇద్దరు స్టార్ హీరోల సినిమాల షూటింగ్ జరుగుతుంది.. నిన్న అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ కోసం వైజాగ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే.. ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.. సుకుమార్ అండ్ టీం కూడా నగరానికి చేరుకుని షెడ్యూల్ కోసం సన్నాహాలు ప్రారంభించారు. మరో వారం రోజుల్లో షూటింగ్ పూర్తి కానుంది. అయితే మెగాపవర్…
ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాలు విడుదల అవుతుంటాయి. అలాగే ఓటీటీలో కూడా సినిమాలు ప్రతివారం విడుదల అవుతాయి.. థియేటర్లలో హిట్ అవ్వని సినిమాలు కూడా ఇక్కడ భారీ విజయాన్ని అందుకున్నాయి.. ప్రతి వారం లాగా, ఈ వారం కూడా ఓటీటీలో సినిమాలు విడుదల అవుతున్నాయి.. అలాగే వెబ్ సిరీస్ లు కూడా విడుదల అవుతున్నాయి.. ఈ వారం అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న హనుమాన్. హిందీ వెర్షన్ రిలీజ్ పై క్లారిటీ వచ్చినా తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్…
హైదరాబాద్ ఉప్పల్ నియోజకర్గంలోని పలువురు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాప్రా సర్కిల్ జమ్మిగడ్డ బీజేఆర్ నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఏ.ఎస్.రావు నగర్ డివిజన్ అధ్యక్షుడు కొత్త అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేరికల సభకు ముఖ్య అతిథిగా ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మంధముల పరమేశ్వర రెడ్డి హాజరయ్యారు. చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ తో కలిసి జమ్మిగద్ద ప్రాంతానికి చెందిన 100 మంది…
పదవిలో ఉన్నప్పుడు సన్మానం చేయడం సహజమని, నేను పదవి విరమణ చేసి సంవత్సరం దాటింది అయినా నాకు సన్మానం చేశారని, వెంటాడి మరీ నాకు సన్మానం చేశారు ఎందుకో అర్ధం కాలేదన్నారు జస్టిస్ ఎన్వీ రమణ. ఇవాళ ఆయన కు ఖమ్మంలో జిల్లాలో సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాకు నాకు అవినాభావ సంబంధం ఉందని, నా చిన్ననాటి స్నేహితులు ఇక్కడ ఉన్నారన్నారు. నేను గతంలో ఖమ్మం వచ్చి మూడు భవనాలకు శంఖుస్థాపన…
వరంగల్ మీదుగా మరో వందేభారత్ ప్రారంభం కానుంది. వరంగల్ మీదుగా సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం నుంచి నడవనుంది. దీనిని దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా సికింద్రాబాద్ నుంచి ప్రారంభించనున్నారు. ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటల వరకు విశాఖపట్నంకు వందే భారత్ ట్రైన్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య రెండవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కాగా.. ఇది తెలంగాణ నుండి నాల్గవ…
టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన మూవీ గామి.. చాందిని హీరోయిన్ గా నటించింది.. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపించాడు విశ్వక్.. దర్శకుడు విద్యాధర్ కటిగ ఈ సినిమాను చాలా చక్కగా తెరాకెక్కించారు.. ఈ సినిమా కోసం అతడు ఆరేళ్లుగా పని చేశాడు. మొత్తానికి అనుకున్నది సాధించాడు.. ప్రస్తుతం అతని కష్టానికి ప్రతిఫలం దక్కింది.. భారీ సక్సెస్ ను అందుకున్నాడు.. ఈ సినిమాను మహా శివరాత్రి కానుకగా విడుదల అయ్యింది..…