N.V Ramana : వెంటాడి మరీ నాకు సన్మానం చేశారు ఎందుకో అర్ధం కాలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పదవిలో ఉన్నప్పుడు సన్మానం చేయడం సహజమని, నేను పదవి విరమణ చేసి సంవత్సరం దాటింది అయినా నాకు సన్మానం చేశారని, వెంటాడి మరీ నాకు సన్మానం చేశారు ఎందుకో అర్ధం కాలేదన్నారు జస్టిస్ ఎన్వీ రమణ. ఇవాళ ఆయన కు ఖమ్మంలో జిల్లాలో సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాకు నాకు అవినాభావ సంబంధం ఉందని, నా చిన్ననాటి స్నేహితులు ఇక్కడ ఉన్నారన్నారు. నేను గతంలో ఖమ్మం వచ్చి మూడు భవనాలకు శంఖుస్థాపన చేసి వెళ్ళానని ఆయన తెలిపారు. ఆ పని ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. భారత దేశంలో న్యాయ వ్యవస్థకు ప్రాదాన్యత లేదని ఆ రోజు అర్ధం అయిందని ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఈ జిల్లా నుంచి ముగ్గురు న్యాయమూర్థులను తయారు చేసానన్నారు. ఖమ్మం కు ఉద్యమాల జిల్లా,ఉద్యమాల ఖిల్లా,పోరాటాల గడ్డ,పోరాటాల బావుటా అనే పేర్లు ఉన్నాయని, పుచ్చలపల్లి గారు రాసిన పుస్తకాలు చదివితే ఇక్కడ కలియ తిరిగినట్లే ఉంటుందన్నారు.
అంతేకాకుండా.. ‘కమ్యూనిష్టు పార్టీ నాయకులు మా ఇంట్లో ఉండి సాయుద పోరాటాలు చేశారు…. నిజాం నిరంకుశ పాలన కు వ్యతిరేకంగా పోరాడారు…. మా నాన్న గారు ఎన్నో పోరాటాల గూర్చి మాకు చెప్పేవారు…. ఎంతోమంది కమ్యూనిష్టు నాయకులు ఖమ్మం లో ఉన్నారు…. బోడెపుడి, మంచికంటి,శీలం సిద్దారెడ్డి, జలగం వెంగళరావు,రజాబ్ అలీ లాంటి మేధావులను కన్న గడ్డ ఇది…. అలనాటి నాయకులను మర్చిపోకూడదు…. ఎంత ఎత్తుకు ఎదిగినా పుట్టిన గడ్డను మర్చిపోవద్దు… మంత్రి తుమ్మల సమర్డత నాకు తెలుసు…. ఆయన ఉంటే అభివృద్ధి ఉన్నట్టే…. మాలాగే ఇక్కడ కూడా మెట్ట భూములు…. అందుకే పారిశ్రామిక రంగంలో దూసుకుపోతుంది…. నిజాయితీ గల రాజకియ నాయకులు ఉన్న ప్రాంతం ఇది… మహాకవి దాశరధి కవితలు ఆమోఘం…. కిన్నెరసాని నది చరిత్ర ఎంతో గొప్పది… భక్తరామదాసు పుట్టిన నేల ఇది… సితమ్మ చీర ఆనవాళ్ళున్న ప్రాంతం ఇది…. నేటి యువత కు ఓ సందేశం…. అభివృద్ధి,లక్షల్లో జీతం,ఎదుగుదల అవసరమే…. కానీ సామాజిక సేవ కూడా అవసరమే…కానీ, చేయట్లేదు…. ధనికులు పేదలకు మధ్య అంతరాయం ఏర్పడుతుంది…. పక్కింటి వాడు కూడా ఎదిగేలాగా మనం సహకరించాలి….. పేదరికం వల్ల అశాంతి వస్తుంది….. సమాజ స్పృహ అవసరం…. దేశమంటే మట్టి కాదోయ్ అనే పద్యం పాడిన జస్టిస్…. మాతృభాష అంతరించే ప్రమాదం ఉంది…. సంస్కృతి,సాంప్రదాయం బ్రతకాలి…. ఆంగ్ల భాష అవసరమే కానీ మాతృ భాష ను మరిచిపోవద్దు…. ఏ దేశం వెళ్లినా మూలాలు మర్చిపోవద్దు…. జన్మనిచ్చిన తల్లిదండ్రులను,గ్రామాన్ని,స్నేహితులను మర్చిపోవద్దు…. నీ గొప్ప తనాన్ని చెప్పుకునేది నీ గ్రామంలోనే…. అమ్మను మరవద్దు,అమ్మభాషను మరవద్దు… కొంతైనా త్యాగం అవసరం..’ అని ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.
Also Read
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
- Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
తాజావార్తలు
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?