న్యాచురల్ స్టార్ నాని వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు… గత కొంతకాలంగా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను కొడుతున్నాడు.. గత ఏడాదిలో హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. కొత్త డైరక్టర్స్ ని పరిచయం చేయడంలో ముందుండే నాని.. తన సినిమాతో శౌర్యువ్ అనే దర్శకుడిని పరిచయం చేశారు. రిలీజ్ కి ముందే నాని, మృణాల్ జోడీ, ప్రోమోలు ఆకట్టుకున్నాయి.. మొదటి షోకే పాజిటివ్ టాక్ ను అందుకున్న ఈ సినిమా ఇప్పుడు…
తాను హెడ్‌లైన్ల కోసం పని చేయనని, డెడ్‌లైన్‌ల కోసం పని చేస్తానని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ కాంక్లేవ్‌లో మోడీ వ్యాఖ్యలు.. సుదీర్ఘకాలం పాటు కష్టపడి పనిచేయాలనే తన ఉత్సాహాన్ని చాటాయి.
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ హాజరయ్యారు. నాంపల్లిలో ఏర్పాటు చేసిన నూతన హైదరాబద్ పార్లమెంట్ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ఆయన ప్రారంభించారు.. అనంతరం హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొంపల్ల మాధవీలత, డా. లక్ష్మణ్ ఎంపీని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. మొదటి జాబితాలోని హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మాధవిలతను ప్రకటించారని, ఈ సారి హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో సంచలనమైన…
ఏప్రిల్ 18న నోటిఫికేషన్ జారీ కానున్నట్లు.. ఆరోజు నుండి నామినేషన్లు స్వీకరించబడుతాయని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. 29న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, 13 మే లోక్ సభ ఎన్నికలకు పోలింగ్.. జూన్ 4న కౌంటింగ్ ఉంటుందన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు లోకి వచ్చిందని ఆయన తెలిపారు. 45,70,138 ఓటర్లు ఉన్నారని, నామినేషన్ చివరి తేదీ వరకు కూడా ఓటర్ నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఓటింగ్…
కాన్హాశాంతి వనంలో ‘గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్’ (ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం)లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ.. అతిథిదేవోభవ స్ఫూర్తి.. భారతదేశ జీవన విధానమన్నారు. గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్ లో ఇవాళ ఇక్కడ పాల్గొంటున్న మీ అందరికీ సుస్వాగతమని, ఇన్నర్ పీస్ టు వరల్డ్ పీస్ ‑ మనశ్శాంతి నుంచి ప్రపంచశాంతి దిశగా మనం ప్రయాణించాల్సిన మార్గాన్ని నిర్దేశించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. 132 ఏళ్ల క్రితం.. అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ…
తెలుగు హీరో శ్రీ విష్ణు తన కామెడితో కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు.. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ఇప్పుడు ‘ఓం భీం బుష్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వంటి ముగ్గురు అద్భుతమైన నటులు కలిసి సినిమా చేస్తే ఇంకెలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ ముగ్గురూ కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ప్రమోషన్స్…
60 మంది సభ్యుల అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు ఏప్రిల్ 19న ఎన్నికలు జరుగుతాయని భారత ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. రాష్ట్రంలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనుండగా.. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్చి 23 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉంటారని రోస్ అవెన్యూ కోర్టు శనివారం తెలిపింది. ఈడీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ బీఆర్ఎస్ నాయకుడిని రిమాండ్‌కు తరలించాలని కోరుతూ ఈడీ చేసిన దరఖాస్తుపై ఉత్తర్వులు జారీ చేశారు. కవితను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని విచారణ సంస్థ కోరింది. అయితే, న్యాయమూర్తి ఆమెకు మార్చి 23 వరకు…
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తెలంగాణలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. కేంద్రంలో ఉన్న బీజేపీనే కవిత అరెస్ట్‌కు కారణం అంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. కవిత అరెస్ట్ పై రాజ్యసభ సభ్యులు డా. లక్ష్మణ్ స్పందించారు. మద్యం కుంభకోణంలో కవితను అరెస్ట్ చేశారని, గత సంవత్సర కాలంగా దర్యాప్తు సంస్థలు అనేక ఆధారాలు సేకరించి అరెస్ట్ చేశారని ఆయన తెలిపారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో కూడా సగం మంది…