తెలుగు హీరో శ్రీ విష్ణు తన కామెడితో కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు.. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ఇప్పుడు ‘ఓం భీం బుష్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వంటి ముగ్గురు అద్భుతమైన నటులు కలిసి సినిమా చేస్తే ఇంకెలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ ముగ్గురూ కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ప్రమోషన్స్ ను కూడా కొత్త చేస్తున్నారు మేకర్స్.. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.. ఆ ట్రైలర్ లో మెరిసిన నలుగురు ముద్దుగుమ్మలు ఎవరో ఒకసారి తెలుసుకుందాం..
పొలిమేర సినిమాలో నటించిన కామాక్షి భాస్కరన్.. వామ్మో ఆమెలో ఇంత మార్పా అనే సందేహం రావడం కామన్.. అమ్మడు హాట్ అందాలకు అందరు ఫిదా అవుతున్నారు.. ట్రైలర్ లో ఒక్కసారి మాత్రమే కనిపిస్తుంది.. సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి..
భీం బుష్ ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరూ ఈమె అందాలకు అంతా ఫిదా అవుతున్నారు. ఆమె లుక్ , ఎక్స్‌పోజింగ్‌కు కుర్రకారు పడిపోవాల్సిందే… ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి..
ప్రీతి ముకుందన్.. ఈమె విష్ణు కన్నప్ప సినిమాలో నటిస్తుంది.. అలాగే ఓం భీం బుష్లో కూడా కనిపించబోతుంది.. తమిళంలో కూడా పలు సినిమాలతో బిజీగా ఉంది..
ఇక చివరగా.. ప్రియా వడ్లమాని.. హుషారుగా సినిమాలో నటించింది.. కానీ ఆ సినిమా తర్వాత ఆఫర్స్ ఏమి రాలేదు.. ఈ సినిమాతో అన్నా అమ్మడుకు కలిసి వస్తుందేమో చూడాలి.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..