న్యాచురల్ స్టార్ నాని వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు… గత కొంతకాలంగా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను కొడుతున్నాడు.. గత ఏడాదిలో హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. కొత్త డైరక్టర్స్ ని పరిచయం చేయడంలో ముందుండే నాని.. తన సినిమాతో శౌర్యువ్ అనే దర్శకుడిని పరిచయం చేశారు. రిలీజ్ కి ముందే నాని, మృణాల్ జోడీ, ప్రోమోలు ఆకట్టుకున్నాయి.. మొదటి షోకే పాజిటివ్ టాక్ ను అందుకున్న ఈ సినిమా ఇప్పుడు టీవీలోకి కూడా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి..
ఈ సినిమాను చూసి కూతుర్లు ఉన్న తల్లిదండ్రులు ఫిదా అయ్యారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇదిలా ఉండగా ఇప్పుడు టీవిలోకి రాబోతుంది.. ఈరోజు సాయంత్రం 6 గంటలకు జెమిని టీవిలో ప్రసారం కానుందని హీరో నాని తన సోషల్ మీడియా ద్వారా వీడియోను రిలీజ్ చేశారు.. ఆదివారం సాయంత్రం మీ ఇంటికి మహి వచ్చేస్తుంది.. మహి వస్తుందంటే వాళ్ల నాన్న కూడా రాబోతున్నాడ అని చెబుతాడు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఈ సినిమా కథ విషయానికొస్తే.. తండ్రి కూతురు మధ్య సెంటిమెంట్ తో వచ్చిన ఈ మూవీ ఫీల్ గుడ్ ఎమోషనల్ గా అందరి చేత కంట తడి పెట్టిస్తుంది. తండ్రీ కూతుళ్ల ప్రేమలు, వారిద్దరి మధ్య సాగే సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్… ఈ సినిమా మొత్తం తండ్రీ కూతుర్ల బంధాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.. క్లైమాక్స్ స్థాయి, ఎమోషన్స్ ని పండిస్తాయి.. కలెక్షన్స్ ను కూడా భారీగానే రాబట్టింది.. నాని ఎప్పటికప్పుడు కొత్త కథలతో ప్రేక్షకులను అలరించే పనిలో ఉన్నాడు.. ఇక సినిమాల విషయానికొస్తే.. వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు..