వాతావరణ మార్పుల హెచ్చరికలను ప్రపంచం గుర్తించింది. 2070 నాటికి 'జీరో ఎమిషన్స్' సాధించాలనే భారత్ అంతర్జాతీయ నిబద్ధతకు మద్దతు లభించింది. ఇదిలా ఉండగా.. వాతావరణం, జీవావరణం మధ్య సమతుల్యతను పాటించాలని సుప్రీంకోర్టు మొదటిసారిగా ఆదేశాలు ఇచ్చింది.
సోమవారం ప్రయాగ్‌రాజ్ వద్ద గంగా నది ఒడ్డున భక్తులు సోమవతి అమావాస్యను జరుపుకున్నారు. హిందూమతంలో సోమవతి అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇందులో భక్తులు తమ పూర్వీకుల ఆత్మలు శాంతించాలని స్నానం, దాన, పూజలు, ఆచారాలను నిర్వహిస్తారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. మే నెలకు షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్స్ మొదలు పెట్టాలని శంకర్ ప్లాన్ చేస్తున్నాడు.. అందుకే గ్యాప్ లేకుండా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు.. ఇటీవల వైజాగా లో కీలక సన్నివేశాలను పూర్తి చేసుకున్న సినిమా ఇప్పుడు మరో షెడ్యూల్ షూటింగ్ ను మొదలుపెట్టినట్లు తెలుస్తుంది.. ఈ మేరకు రామ్ చరణ్ రాజమహేంద్ర వరకు పయనమయినట్లు…
కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నా, అప్పటి గాయాలు చాలా మందిని ఇంకా వెంటాడుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. కొవిడ్ వచ్చినప్పుడు చాలా మంది బతకాలనే ఆశతో ఆస్తులను అమ్మి వైద్యం చేయించుకున్నారని, కానీ ఆర్థికంగా అన్నీ కోల్పోయి ఇంకా ఎందుకు బతికున్నామా అని ఇప్పుడు కుమిలిపోతున్నారని ఆయన అన్నారు.
మీరు డబ్బుతో కొనలేనిది లేదా ఏ చికిత్స ద్వారా తిరిగి పొందలేనిది ఈ ప్రపంచంలో వయస్సు మాత్రమే. వయస్సు దాటిన తర్వాత తిరిగి దానిని ఈ ప్రపంచంలో ఎవరూ తిరిగి పొందలేరు. అందువల్ల, ప్రతి వ్యక్తి తన జీవితం సుదీర్ఘంగా ఉండాలని కోరుకుంటాడు.
లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ కన్నేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఆ పార్టీ 'అబ్ కీ బార్ 400 పార్' నినాదాన్ని ఇచ్చింది.
గతంలో పొరుగు రాష్ట్రాలు చూడడానికి వెళ్లామని, ఇప్పుడు పొరుగు రాష్ట్రాలు మన ప్రభుత్వం వైపు చూసి వెళ్తున్నాయని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట శిరికి రిసార్ట్స్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్.కోట మండల స్థాయి విస్తృత సమావేశంలో ముఖ్యఅతిధిగా మంత్రి పాల్గొన్నారు.
వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఆమె వద్దనే 2.5 లక్షల అప్పు తీసుకున్న ఓ వ్యక్తి.. అప్పు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 27 మహిళా అదృశ్యం కేసు నమోదు కాగా.. కాల్‌డేటా ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు. ఎట్టకేలకు నిందితుడు తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.
ఈనెల 14న తెనాలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారని, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలు పరిపాలన సాగించిన జగన్ మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర పరిస్థితులపై ఎప్పటికీ అవగాహన రాలేదన్నారు. వాలంటరీ వ్యవస్థను ఎన్నికల డ్యూటీలో పెట్టవద్దని ఎన్నికల కమిషన్ చెప్పిందన్నారు. కాంట్రాక్టు బేస్ తో పనిచేసేవాళ్లను ఎలక్షన్ కమిషన్ ఎన్నికల్లో వాడదని, గ్రామ…