జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో నిజామాబాద్‌లో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో విప్, ఎమ్మెల్యే లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజాన్ని చీల్చడమే లక్ష్యంగా బిజెపి మేనిఫెస్టో అని ఆయన విమర్శించారు. భగవద్గీత లాంటి రాజ్యాంగాన్ని బీజేపీ మారుస్తాం అనడం హాస్యాస్పదమని ఆయన మండిపడ్డారు. మోడీకి ఆదాని, అంబానీ అండ రాహుల్ గాంధి కి ఎవరు ఉన్నారని, దేశ సమగ్రత, దేశ…
రాహుల్ గాంధీ కుటుంబం ప్రజలు ఎప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటారని.. అధికారం కోసం అడ్డదారులు తొక్కరని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. జిమ్మిక్కులతో అధికారంలోకి రావాలలనేది మోడీ, అమిత్ షా విధానమని ఆయన విమర్శించారు.
ప్రతి పండుగకు సినిమాల సందడి మాములుగా ఉండదు.. కొత్త సినిమాల నుంచి పోస్టర్స్, లేదా సినిమా అనౌన్స్మెంట్స్ వస్తూనే ఉంటాయి.. ఈ ఉగాది పండుగ సందర్బంగా చాలా సినిమాల ప్రకటనలు వెలువడ్డాయి.. తాజాగా మరో కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది.. సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా ‘ఏ మాస్టర్ పీస్’. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్ , ఆషు రెడ్డి ప్రధాన పాత్రలో లో నటిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా పోస్టర్ ను…
ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఉదయం ఆర్ఆర్ఆర్‌లో భూములు కోల్పోతున్న గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 500 మంది రైతులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బంజారాహిల్స్‌లోని వారి నివాసంలో కలిశారు.
టాలీవుడ్ సీనియర్ హీరో మాస్ మహారాజా రవితేజ సినిమాల సంగతి తెలిసిందే.. ప్లాప్ సినిమాలు పలకరిస్తున్నా కూడా ఎక్కడా తగ్గలేదు.. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు.. రీసెంట్ గా రవితేజ ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా పర్వాలేదనిపించింది.. ఇప్పుడు తన 75వ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో ఈ సినిమాను చెయ్యనున్నారు.. తాజాగా ఉగాది సందర్బంగా ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు మేకర్స్.. రవితేజ అంటే మాస్…
సిద్దిపేటకు అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని సిద్దిపేట యువతకు మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేటలో సోమవారం జరిగిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) యువజన విభాగం సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేటకు మాజీ ముఖ్యమంత్రి మంజూరు చేసిన ప్రభుత్వ వెటర్నరీ కళాశాలను తీసుకోవడమే కాకుండా రూ.150 కోట్ల నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రద్దు చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న…
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ 24వ బోర్డు సమావేశం ఈ రోజు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, దీనిని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామన్నారు. ప్రాజెక్ట్‌పై పెట్టుబడిదారులు, వాటాదారుల విశ్వాసాన్ని పెంచడానికి మూసీ పరివాహక ప్రాంతాన్ని వేగంగా అభివృద్ధి చేసేవిధంగా కొన్ని ప్రాజెక్టులను గుర్తించాలని ఆమె అధికారులను కోరారు. నిపుణుల కమిటీ, సలహా…
ఈ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ను 14 సీట్లలో గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకు తగ్గట్టుగానే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు రేవంత్ రెడ్డి.. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సొంత నియోజకవర్గంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో పార్టీ నేతలకు, శ్రేణులకు కీలక సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహబూబ్‌నగర్ పార్లమెంట్ సీటుపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. తన…
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని, ప్రజల ఆశలు ఆకాంక్షలన్నీ నెరవేరాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, రైతుల రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని ముఖ్యమంత్రి అభిలషించారు. నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి…
రాష్ట్రంలో తాగునీటి సమస్యకు కాంగ్రెస్ పాలకులే కారణం, ప్రణాళికలు లేనీ వ్యవహారశైలి మూలమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ ఆయన నాగర్‌కర్నూలు జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. రిజర్వాయర్ల నీళ్లపై అబద్ధాలు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వమన్నారు. రాష్ట్రంలో రిజర్వాయర్ల నీటిని సద్వినియోగపరిస్తే పంటలు ఉండేవి కావని, 100 రోజుల పాలనలో తెలంగాణను బ్రష్టు పట్టించిన కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు. రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, కల్యాణ లక్ష్మి లేదు, కెసిఆర్ ని తిట్టడం…