వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని వైద్యుడ్ని దైవంతో పోలుస్తూ వైద్యో నారాయణో హరి అని మన పెద్దవాళ్లు ఎప్పుడో చెప్పారని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా ప్రాణాన్ని నిలబెట్టే వైద్యులు నిజంగానే మరో దేవుడితో సమానం అన్నారు. కరోనా పరిస్థితుల్లోనూ తమ ప్రాణాలను లెక్కచేయక రోగులకు వైద్యం అందించడం గొప్ప విషయo అభినందనీయం అన్నారు. కూకట్పల్లి డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి…
సన్నాహాక సమావేశంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్ట కాలంలో గులాబీ జెండా ను గద్దేనెక్కించింది ఘనపూర్ గడ్డా అని ఆయన అన్నారు. మోసగాళ్ళకే మోసగాడు కడియం శ్రీహరి అని ఆయన విమర్శించారు. తొక్కల మినిస్టర్ నాలుగు సార్లు చేసి డిగ్రీ కళాశాల తేలేదని, ఘనపూర్ కు ఎక్కువ నష్టం చేసిన కడియం ను రాజకీయ సమాధి చేయాలన్నారు పల్లా. మున్సిపాలిటీ,టెక్స్టైల్ పార్కు, సైనిక్ స్కూల్ రాకుండా అడ్డుపడ్డాడని,…
రెండోసారి అధికారమే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ దూకుడుగా వెళ్తోంది. వైసీపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. జగ్గంపేట వైసీపీ అభ్యర్థి తోట నరసింహం గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఆయనకు మద్దతుగా కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో నిర్వహిస్తున్నారు.
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అందరి ఫోకస్ తుని అసెంబ్లీ నియోజకవర్గంపైనే ఉంది. ఈ ప్రతిష్ఠాత్మక సెగ్మెంట్‌లో మరోసారి విజయకేతనం ఎగరవేయాలని అధికార వైసీపీ ఆశిస్తోంది. గెలుపు కోసం ఆ పార్టీ అభ్యర్థి, మంత్రి దాడిశెట్టి రాజా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన తరఫున కుటుంబ సభ్యులు కూడా ప్రచారం చేపడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం బల్క్ వినియోగదారులకు అన్ని సబ్సిడీలను రద్దు చేసినందున ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS) తమ పెట్రోల్ బంక్‌లను రిటైల్ అవుట్‌లెట్‌లుగా మార్చాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో నాబార్డు సహకారంతో ఒక్కో బంక్‌పై దాదాపు రూ.40 నుంచి రూ.50 లక్షలు వెచ్చించి పాత, మూతపడిన ఇంధన కేంద్రాలను ఆధునీకరించాలని పీఏసీఎస్ అధికారులు నిర్ణయించారు . రిటైల్ అవుట్‌లెట్‌లు కొన్ని స్పెసిఫికేషన్‌లను అనుసరించడం తప్పనిసరి. ఇంధన స్టేషన్లు తప్పనిసరిగా రోడ్డు పక్కన గోడలు మరియు టైల్…
సిద్దిపేటకి కేసీఆర్, హరీష్ రావు ఏం చేశారని రేవంత్ చెబుతున్నారని, కళ్ళుండి సీఎం రేవంత్ రెడ్డి చూడలేకపోతున్నారా అర్థం కావట్లేదన్నారు హరీష్ రావు. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి అవార్డులు లేకుండా సిద్దిపేట లేదని, సిద్దిపేట అభివృద్ధి కాలేదని సీఎం రేవంత్ పచ్చి అబద్దాలు మాట్లాడారన్నారు హరీష్. తెలంగాణ రావడానికి కారణం కేసీఆర్, సిద్దిపేట గడ్డ అని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడంటే కారణం సిద్దిపేట అని ఆయన హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాకపోతే రేవంత్…
సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. పెన్షన్ దారులు పడుతున్న ఇబ్బందులపై లేఖలో ప్రస్తావించారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ముందు సామాజిక పెన్షన్ల లబ్దిదారుల్ని వేధిస్తున్నారని.. అధికార పార్టీకి లబ్ది చేకూర్చేలా వ్యవహరించడం బాధాకరమని లేఖలో చంద్రబాబు తెలిపారు.
దేశంలో 2014కి ముందు 2014 తరవాత అన్నట్టు చూడాలని ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నల్లధనం తీసుకు వస్తా అని.. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా నని హామీలు ఇచ్చి మోసం చేశారని, భారతీయ జుమ్లా పార్టీ గా మారింది బీజేపీ అని ఆయన మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే దేశ ద్రోహి అని ముద్ర వేస్తున్నారని మధు యాష్కీ విమర్శించారు. కరోనా వస్తే మోడీ దీపాలు…
ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.. ఎన్నికల పోలింగ్ కు అతి కొద్దిరోజులు మాత్రమే ఉండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో స్పీడును పెంచారు.. ఇక కొందరు అభ్యర్థులు మాత్రం తమకోసం ప్రచారం చెయ్యాలంటు సినీ తారలను దించుతున్నారు.. తాజాగా హీరోయిన్ నమిత కూడా ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.. బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు వచ్చింది.. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ తరపున ఆమె ప్రచారం చేశారు.. ఆయన టీడీపీ,…