దేశంలో 2014కి ముందు 2014 తరవాత అన్నట్టు చూడాలని ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నల్లధనం తీసుకు వస్తా అని.. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా నని హామీలు ఇచ్చి మోసం చేశారని, భారతీయ జుమ్లా పార్టీ గా మారింది బీజేపీ అని ఆయన మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే దేశ ద్రోహి అని ముద్ర వేస్తున్నారని మధు యాష్కీ విమర్శించారు. కరోనా వస్తే మోడీ దీపాలు పెట్టమన్నారు.. కేసీఆర్ పారా సెటమాల్ చాలు అన్నారని, ఇలాంటి ఇద్దరిని ప్రజలు భరించారని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో అత్యంత ప్రమాద కర స్థితిలో రాజకీయం ఉందని, 2 లక్షల కోట్లకు gst పెరిగింది..కానీ ఆధాని అంబానీ లకు పోతుందన్నారు మధు యాష్కీ. కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు ఎన్ని?. కేసీఆర్ దీక్ష చేస్తున్న సమయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు నా దగ్గరికి వచ్చి తెలంగాణ రాష్ట్రం వద్దు.. ప్రకటన చాలు అని అడిగారని, బతుకమ్మ తో రాజకీయాలు చేస్తూ.. మద్యం కేసులో డబ్బులు దోచుకుని జైలుకు వెళ్ళింది కవిత అని ఆయన విమర్శించారు.
అంతేకాకుండా.. ‘తెలంగాణ వచ్చాకా బాగుపడింది కేవలం కేసీఆర్ కుటుంబమే.. దేశంలో నడుస్తుంది మోడీ టాక్స్.. అదానీ టాక్స్.. ఎలాక్ట్రోరల్ బాండ్ రూపంలో టాక్స్ నడుస్తుంది. తెలంగాణ లో RR టాక్స్ లేదు.. దేశంలో నే మోడీ టాక్స్ నడుస్తుంది. దేశంలో అధికారంలో ఉన్నది నువ్వే కదా… విచారణ జరిపించండి.. అవినీతి పరులను పార్టీలో చేర్చుకోం.. మల్లారెడ్డి చేరుతా అన్నాడు.. కొడుకు టికెట్ కూడా అడిగారు… కానీ సీఎం వద్దు అన్నాడు. హరీష్ రావు సిద్దిపేటలో టెంపరేచర్ ఎక్కువ ఉండి.. ఆయనకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు.. చాలా మంది అధికారులు బీఆర్‌ఎస్‌కి బీటీంగా పని చేస్తున్నారు. కేసీఆర్ కరెంట్.. కరువు గురించి ఉదయం మాట్లాడితే హ్యాంగ్ ఓవర్ తో.. మధ్యాహ్నం ఎండ దెబ్బకి .. సాయంత్రం మాట్లాడితే.. మందు వేసి మాట్లాడినట్టు.. కేసీఆర్ తల నరుక్కుంటా అన్నాడు..ఎన్ని సార్లు నరుక్కున్నాడు.. కాలు బాగా అయ్యాకా కూడా.. కట్టే పట్టుకుని నడిచినా సానుభూతి రాలేదు.. రేవంత్ అసలు పరిపాలన చేయలేడు అనుకున్నాడు కేసీఆర్.. రేవంత్ సీఎం అవ్వడం.. అవినీతి మచ్చ లేకుండా నడవడం తో కేసీఆర్ జీర్ణించుకోలేక మట్లాడుతున్నారు కేసీఆర్.’ అని మధు యాష్కీ అన్నారు.