ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా షూటింగ్ మొదలు పెట్టిన బాలీవుడ్ రామాయణంకు ఒకటిపోతే మరొకటి చుట్టుముడుతున్నాయి.. షూటింగ్ ప్రారంభం అయిన కొద్ది రోజులకే లీకులు మొదలయ్యాయి.. ఇప్పుడు ఏకంగా సినిమాకు నోటీసులు అందాయి. అప్పుడే వివాదాలు మొదలయ్యాయి.. తెలుగు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాకు నోటీసులు పంపినట్లు తెలుస్తుంది.. ప్రముఖ నిర్మాత మధు మంతెన ఆ సినిమా నిర్మిస్తున్న ప్రైమ్ ఫోకస్ టెక్నాలజీస్ కు నోటీసు పంపడంతో ఒక్కసారిగా వ్యవహారం చర్చలోకి వచ్చింది. అల్లు అరవింద్…
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య రీసెంట్ గా ధూత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమాకు మంచి స్పందన వచ్చింది.. అక్కినేని నాగచైతన్య – చందు మొండేటి దర్శకత్వం లో రాబోతున్న మూడో సినిమా తండేల్..ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్…
తెలంగాణలో జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఎన్నికల సభల్లో ప్రసంగించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు రానున్నారు. మే 10న మధ్యాహ్నం 2 గంటలకు నారాయణపేట, సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో మరో రెండు సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపు మరోసారి తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. రేపు మధ్యాహ్నం మూడు గంటలకి మహబూబ్‌నగర్ పార్లమెంట్ నారాయణపేట బహిరంగ సభలో పాల్గొననున్న మోడీ.. సాయంత్రం ఐదు గంటలకు ఎల్బీ స్టేడియంలో…
గుజరాత్‌లోని దాహోద్ లోక్‌సభ స్థానం పరిధిలోని పోలింగ్ స్టేషన్‌లో మే 11న తాజాగా ఓటింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశించింది. దానికి కారణం ఏంటంటే.. ఓ వ్యక్తి ఓటింగ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షప్రసారం చేయడమే.
నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్ కు ముందే హనుమాన్ దీక్షాపరులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గతంలో కేటీఆర్ జై శ్రీరామ్ అనే మాట అన్నం పెడుతుందా..! అని అన్న వ్యాఖ్యలకు నిరసనగా హనుమాన్ మాలధారులు జై శ్రీరాం నినాదాలు చేస్తూ కేటీఆర్ రాకకు నిరసన తెలిపారు. కొద్దిసేపు పోలీసులకు, స్వాములకు…
నర్సాపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో కాంగ్రస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం రాకముందు అత్తాడుగువర్గాల వారికీ ఎటువంటి హక్కులు లేవని, రాజ్యాంగం వచ్చాకే మనకు హక్కులు వచ్చాయన్నారు. ఈ రాజ్యాంగం మన కోసం మనం రాసుకోవడానికి అనేకమంది తమ రక్తాన్ని ధారాబోశారని, బీజేపీ అగ్ర నేతలు రాజ్యాంగాన్ని మారుస్తామని బహిరంగంగా చెబుతున్నారన్నారు రాహుల్ గాంధీ. మోడీ, ఆర్‌ఎస్‌ఎస్ ఈ రాజ్యాంగాన్ని మార్చాలని అంటుందని, రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత మాదని…
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ కార్యక్రమాలను పెంచుతానని.. ప్రజల ఆదాయన్ని పెంచుతానని ఆయన హామీ ఇచ్చారు. టీడీపీ పేదవాళ్ల పార్టీ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.
గత 25 ఏళ్లుగా మెదక్ పార్లమెంటు బీజేపీ, బీఆర్ఎస్ చేతిలో నలిగిపోయిందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ నర్సాపూర్‌లో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అందుకే రాహుల్ గాంధీ నీలం మధుని మెదక్ నుంచి బరిలో నిలిపారని, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుని దుబ్బాకలో బండకేసి కొడితే ఇక్కడికి వచ్చారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ అభ్యర్థి మల్లన్నసాగర్ లో…
పార్టీ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం, సమాజాన్ని కులం, భాష పేరుతో విభజన చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విచ్ఛిన్న కర శక్తులకు ఆ పార్టీ టిక్కెట్లు కూడా ఇచ్చిందని ఆయన మండిపడ్డారు. మత ప్రాతిపదికన దేశ విభజనకు కారణం కాంగ్రెస్ చర్యలు అని ఆయన ఆరోపించారు. దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా రాహుల్ గాంధీ తో పాటు ఆ పార్టీ నాయకులు విదేశాల్లో మాట్లాడారని,…
వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా పథకాలు అందించామన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో 20 నుంచి 30 కోట్ల రూపాయలు ప్రజలకు చేరాయన్నారు.