ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా షూటింగ్ మొదలు పెట్టిన బాలీవుడ్ రామాయణంకు ఒకటిపోతే మరొకటి చుట్టుముడుతున్నాయి.. షూటింగ్ ప్రారంభం అయిన కొద్ది రోజులకే లీకులు మొదలయ్యాయి.. ఇప్పుడు ఏకంగా సినిమాకు నోటీసులు అందాయి. అప్పుడే వివాదాలు మొదలయ్యాయి.. తెలుగు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాకు నోటీసులు పంపినట్లు తెలుస్తుంది..
ప్రముఖ నిర్మాత మధు మంతెన ఆ సినిమా నిర్మిస్తున్న ప్రైమ్ ఫోకస్ టెక్నాలజీస్ కు నోటీసు పంపడంతో ఒక్కసారిగా వ్యవహారం చర్చలోకి వచ్చింది. అల్లు అరవింద్ భాగస్వామిగా కొన్నేళ్ల క్రితమే మధు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు మొదలుపెట్టి ఆ మేరకు స్క్రిప్ట్ సిద్ధం చేయించారు.. అయితే ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు అనే విషయం తేలకుండానే సినిమా షూటింగ్ను మొదలు పెట్టారు.. ఈ విషయం తెలుసుకున్న మధు మంతెన, అల్లు అరవింద్ లు నోటీసులు పంపించారట..
తమ అనుమతి లేకుండా ఎలాంటి హక్కులు మీకు చెందవనేది అందులో పేర్కొన్నారు. సాంకేతికంగా పూర్తి వివరాలు నోటీసులో వెల్లడించలేరు.. కానీ తమకున్న రైట్స్ ప్రకారం ముందుకు వెళ్తే మాత్రం చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టంగా పేర్కొన్నారు.. ఈ సినిమాలో రాఖీ భాయ్ యశ్ కూడా భాగస్వామ్యం అయ్యాడు.. ఈ సినిమాను మూడు పార్ట్ లు తెరకేస్తున్నారు. సాయిపల్లవి సీతగా నటిస్తున్న ఈ ఎపిక్ డ్రామాలో చాలా పెద్ద క్యాస్టింగే ఉంది. మరి ఈ వివాదాలు ఎక్కడివరకు వెళ్తాయో చూడాలి..