Rahul Gandhi : రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత మాది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నర్సాపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో కాంగ్రస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం రాకముందు అత్తాడుగువర్గాల వారికీ ఎటువంటి హక్కులు లేవని, రాజ్యాంగం వచ్చాకే మనకు హక్కులు వచ్చాయన్నారు. ఈ రాజ్యాంగం మన కోసం మనం రాసుకోవడానికి అనేకమంది తమ రక్తాన్ని ధారాబోశారని, బీజేపీ అగ్ర నేతలు రాజ్యాంగాన్ని మారుస్తామని బహిరంగంగా చెబుతున్నారన్నారు రాహుల్ గాంధీ. మోడీ, ఆర్‌ఎస్‌ఎస్ ఈ రాజ్యాంగాన్ని మార్చాలని అంటుందని, రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత మాదని ఆయన వ్యాఖ్యానించారు. మనకి ఓటు వేసే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని, మోడీ ప్రభుత్వ సంస్థలన్నీ ప్రయివేటు పరం చేస్తున్నారన్నారు. రిజర్వేషన్లు తీసేయడానికే మోడీ ఇలా కుట్ర చేస్తున్నారని, రిజర్వేషన్లు తీసేయాలని బిజెపి అంటుంది…మేము 50 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు రాహుల్ గాంధీ.
అంతేకాకుండా..’తెలంగాణలో కులగణన జరిగినట్టే..దేశమంతా కూడా కులగణన చేస్తాం. దేశంలో ఏ సామాజిక వర్గం వారు ఎంతమంది ఉన్నారో వారికి తెలియాలి. ఇలా జరిగినప్పుడే నిజమైన రాజకీయ చైతన్యం ప్రారంభం అవుతుంది. కేవలం 2 శాతం ఉన్నవారి చేతిలోనే దేశ సంపద మొత్తం ఉంది. మోడీ ఎయిర్ పోర్టులు, పెద్ద పెద్ద సంస్థలు అదాని కి అప్పగిస్తున్నారు. దేశ సంపద మొత్తం 20, 25 మంది చేతుల్లోనే ఉంది. ఆ సంపద కోట్ల మందికి రావాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రపంచంలో ఎలాంటి ప్రభుత్వం ఇటువంటి పనులు చేయకపోవచ్చు. దేశంలో ఉన్న ప్రతి పేద కుటుంబ స్థితిగతులపై అధ్యయనం చేస్తున్నాము. ఎంపిక చేసిన పేదలకు ఒక లక్ష రూపాయలు అకౌంట్ లో వేస్తాము. ప్రతి మహిళ అకౌంట్ లో 8500 ప్రతి నెల తప్పకుండా వేస్తాము. ఒక్క దెబ్బతో దేశంలో, తెలంగాణలో పేదరికాన్ని నిర్ములిస్తాం. మోడీ కోట్ల మంది యువకులకు ఉద్యోగాలు ఇవ్వలేదు.
Also Read
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
- AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
- Trump-Meloni: ‘‘వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు’’.. ట్రంప్ పోస్టుకు ఇటలీ కౌంటర్..
- Team India Players: టీమిండియా ఆటగాళ్లలో మొదలైన భయం.. మా వంతు రాదని గ్యారెంటీ ఏంటి అంటూ..
పెద్ద నోట్ల రద్దు మోడీ అదాని ప్రయోజనాల కోసమే చేశారు. ఇండియా కూటమి జూన్ 7న ఏర్పడబోతుంది. 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న మోడీ ఇవ్వలేకపోయారు. ఆగస్ట్ 15నాడు మిగిలిన ఉద్యోగాలు భర్తీ చేస్తాం. రైతులను ప్రధాని అనేక రకాలుగా వేదించారు. కొట్లాదిపతుల రుణాలను మాఫీ చేశారు కానీ…రైతుల రుణమాఫీ చేయలేదు. మేము రాగానే రైతుల సమస్యలు తీరుస్తాం. ధాన్యానికి మద్దతు ధర కచ్చితంగా ఇస్తాము. ఉపాధిహామీ కూలిని 400 రూపాయలకు పెంచుతాం. మోడీ అదాని, అంబానీలకు సొమ్ము ఇచ్చారో.. మేము అంత సొమ్మును పేదల అకౌంట్ లో వేస్తాము. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీ కోసమే పని చేస్తూంది. 30 వేల ఉద్యోగాలు, 500 కె సిలిండర్, ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 10 లక్షల ఆరోగ్య శ్రీ అమలు చేస్తున్నాం. ఆగస్ట్ 15నాటికి రెండు లక్షల రుణమాఫీ చేస్తాం. మీ కోసం ఢిల్లీలో సైనికుడిలా పని చేస్తాను’ అని రాహుల్ గాంధీ అన్నారు.
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!