టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి అందరికీ తెలుసు.. రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు… ఆ సినిమా అనుకున్న రిజల్ట్ ను ఇవ్వలేక పోయింది.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. రౌడీ హీరో లైనప్ మహా గొప్పగా ఉంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ మీద గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మూవీ, దిల్ రాజు నిర్మాతగా రవికిరణ్ కోలాతో చేయబోయే చిత్రం, రాహుల్ సంకృత్యాన్ తో లాక్ చేసుకున్న…
మేడిగడ్డ బ్యారేజీకి కీలకమైన మేడిగడ్డ , అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై తదుపరి అధ్యయనాలు/పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం సోమవారం నిర్ణయించింది . దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రానికి చెందిన మూడు సంస్థలను ఈ పని కోసం గుర్తించినట్లు తెలిపారు. ప్రతి బ్యారేజీకి సంబంధించిన భౌతిక మరియు సాంకేతిక అంశాలను గుర్తించిన రెండు సంస్థలు అధ్యయనం చేస్తాయి. ఎలాంటి మరమ్మతులు చేపట్టాలో వారి సిఫార్సులు మరియు ఫలితాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామని,…
తెలుగు వారు ఎక్కడికి వెళ్లిన రాణిస్తున్నారు. తమ ప్రతిభను కనబరిచి అగ్ర రాజ్యంలో సైతం గౌరవమైన పదవులను సొంతం చేసుకుంటున్నారు. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా విజయవాడకు చెందిన జయ బాదిగ నియమితులయ్యారు.
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రాష్ట్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది. రైతులకు ఇబ్బంది లేకుండా సాఫీగా కొనుగోళ్లు జరిగేందుకు జిల్లా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని, రేపటి నుంచి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ప్రతి రోజు ఎక్కడో ఒకచోట కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని సూచించింది. ఎక్కడ రైతులకు ఇబ్బంది తలెత్తినా, కొనుగోళ్ల ప్రక్రియకు అడ్డంకులు ఎదురైనా వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత కలెక్టర్లు నిర్వహించాలని, అకాల వర్షాలతో తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని…
ప్రముఖ మొబైల్ కంపెనీ రెడ్ మీ నుంచి సరికొత్త ఫీచర్స్ తో కొత్త మొబైల్స్ వస్తూనే ఉంటాయి.. తాజాగా మరో బడ్జెట్ ఫోన్ ను విడుదల చేశారు.. రెడ్‌మీ నోట్ 13ఆర్ పేరుతో ఈ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేయగా.. త్వరలోనే ఇండియాలోకి రాబోతుందని తెలుస్తుంది.. ప్రస్తుతం ఈ ఫోన్ ఫీచర్స్, ధర ఆన్లైన్లో విడుదల అయ్యాయి.. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం.. ఈ కొత్త ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.79 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను…
ఈదురు గాలులతో కూడిన వర్షం రావడంతో పిడుగు దాటికి తాండూరు పట్టణంలోని పాత తాండూరులో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో బాలునికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే తాండూర్ నియోజకవర్గంలో వరుస పిడుగుపాటులు పడడంతో వ్యక్తులు మృతి చెందుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు పిడుగుపాటుకు యాలాల మండలంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, 24 గంటలు గడవకముందే పిడుగుపాటుకు మరో వ్యక్తి బలయ్యాడు. పాత తాండూర్ సమీపంలో హోటల్ నిర్వహిస్తున్న శేఖర్ అనే వ్యక్తి కాలకృత్యాల…
దాచిన సొమ్ము దెయ్యాల పాలు చేసినట్లు.. కష్టపడి సంపాదించిన సొమ్మును కూడబెట్టుకునేందుకు చూస్తే.. అసలు పోయింది.. వడ్డీ పోయింది. మధ్యతరగతి కుటుంబాలు డబ్బును సంపాదించేందుకు ఎంత కష్టపడుతారో చెప్పనక్కర్లేదు. మధ్య తరగతి కుటుంబాలకు ఆఫర్ వచ్చిందంటే వస్తువులు కొనేస్తుంటారు. ఒక శాతం వడ్డీ ఎక్కువ ఇస్తామంటే.. ఆ బ్యాంకులోనే సేవింగ్స్ చేసుకుంటారు. అలాంటి ఏకంగా ఎక్కడ లేని విధంగా అధిక వడ్డీ ఇస్తామని చెబితే ఊరుకుంటారా.. ఇప్పుడూ అదే జరిగింది. అధిక వడ్డీ ఆశ చూపెట్టి బిచాం…
టాలీవుడ్ హీరో ఆనంద్ దేవరకొండ రీసెంట్ గా ఓ బేబీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా సాలిడ్ సక్సెస్ ను అందుకోవడంతో ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన ప్రగతి శ్రీ వాత్సవ హీరోయిన్గా నటిస్తోంది. హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సెలగం శెట్టి మరియు వంశీ కారుమంచి నిర్మాతలుగా ఉన్నారు. ఈ సినిమా ఉదయ్ శెట్టి దర్శకత్వంలో…
ఓటీటీ లోకి వస్తున్న సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. ఈ మధ్య కొన్ని సినిమాలు ఓటీటీలోకే నేరుగా విడుదల అవుతున్నాయి.. ప్రతి వారం లాగే ఈ వారం కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఈ వారం ఏ సినిమా ఎక్కడ విడుదల అవుతుంది అనేది ఇప్పుడు చూసి తెలుసుకుందాం.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్… షిన్ చాన్ సీజన్ 16 కిడ్స్ (యానిమేషన్ వెబ్ సిరీస్)- మే 20 డోరామ్యాన్ సీజన్ 19…
మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది.. బత్తిని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికూడా చేప ప్రసాదం పంపిణీకి బత్తిని ఫ్యామిలీ సిద్ధమైంది. జూన్ 8న నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని కుటుంబీకులచే వార్షిక ‘చేప ప్రసాదం’ ప్రజలకు పంపిణీ చేయనున్నారు. ప్రతి సంవత్సరం, బత్తిని కుటుంబం ఆస్తమా మరియు ఇతర శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి చేప ప్రసాదం పంపిణీ చేస్తుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే…