Ponguleti Srinivas Reddy : యాసంగిలో 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేడిగడ్డ బ్యారేజీకి కీలకమైన మేడిగడ్డ , అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై తదుపరి అధ్యయనాలు/పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం సోమవారం నిర్ణయించింది . దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రానికి చెందిన మూడు సంస్థలను ఈ పని కోసం గుర్తించినట్లు తెలిపారు. ప్రతి బ్యారేజీకి సంబంధించిన భౌతిక మరియు సాంకేతిక అంశాలను గుర్తించిన రెండు సంస్థలు అధ్యయనం చేస్తాయి. ఎలాంటి మరమ్మతులు చేపట్టాలో వారి సిఫార్సులు మరియు ఫలితాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామని, కమాండ్ ఏరియాలోని రైతుల సాగునీటి అవసరాలను తీర్చడానికి బ్యారేజీల నుండి నీటిని ఎత్తిపోసే అవకాశాలను అన్వేషించాలని ప్రాజెక్ట్ అధికారులను కోరినట్లు ఆయన చెప్పారు. యాసంగి లో 36 లక్షల మెట్రిక్ టన్ను ల ధాన్యం సివిల్ సప్లై శాఖ కొనుగోలు చేసిందని, కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు మూడు రోజుల్లోనే డబ్బులు ఖాతాలో వేశామన్నారు. గత పదేళ్లలో ఎప్పుడు ఇంత తొందరగా ధాన్యం సేకరించలేదు. డబ్బులు చెల్లించలేదని, అకాల వర్షాలు ఎప్పుడు లేని విధంగా పది రోజుల నుంచి రాష్ట్రంలో కురుస్తున్నాయని ఆయన తెలిపారు.
అంతేకాకుండా..’రాష్ట్ర ప్రభుత్వం అకాల వర్షాల వల్ల జాగ్రత్తలు తీసుకున్నా ధ్యానం తడిసింది. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ధాన్యం కొనుగోలు భాద్యత కలెక్టర్లకు అప్పగించాము. తడిసిన ధాన్యం పై రైతులు ఆందోళన చెందవద్దు. మధ్యాహ్న భోజనం కోసం, హాస్టల్స్ కోసం 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. ఎన్నికల సమయంలో సన్న బియ్యం ఇస్తామని హామీ ఇచ్చాము. సన్న బియ్యం కింటకు 500 రూపాయల బోనస్ ఇస్తాం. సన్న బియ్యంను వ్యవసాయ అధికారులు గుర్తిస్తారు. బోగస్ విత్తనాలు అరికట్టాలని.. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాము. లూజ్ విత్తనాలు కొనుగోలు చేయవద్దు. సర్టిఫైడ్ దుకాణంలో కొనుగోలు చేసి రిసిప్ట్ రైతులు దగ్గర పెట్టుకోవాలి. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా రాబోయే నెల రోజుల్లో మోడ్రన్ స్కూల్స్ గా మారుస్తాం. ‘ అని మంత్రి పొంగులేటి తెలిపారు.
Also Read
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
-
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!