టాలీవుడ్ హీరో ఆనంద్ దేవరకొండ రీసెంట్ గా ఓ బేబీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా సాలిడ్ సక్సెస్ ను అందుకోవడంతో ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన ప్రగతి శ్రీ వాత్సవ హీరోయిన్గా నటిస్తోంది. హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సెలగం శెట్టి మరియు వంశీ కారుమంచి నిర్మాతలుగా ఉన్నారు. ఈ సినిమా ఉదయ్ శెట్టి దర్శకత్వంలో వస్తోంది.. ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను లాంచ్ చేశారు..
మొన్న వచ్చిన సాంగ్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.. సినిమా పై హైప్ ను పెంచేందుకు మేకర్స్ తాజాగా ట్రైలర్ ను వదిలారు.. ఆనంద్ దేవరకొండ తన పంచ్ డైలాగులతో ట్రైలర్ మొదలవుతుంది.. అమ్మాయిలకు వల విసురుతూ అబద్దాలు చెబుతూ హీరో కనిపిస్తాడు.. యాక్షన్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ను చూపిస్తూ ట్రైలర్ ను కట్ చేశారు… ఒక దొంగగా ఉన్న ఉన్న అతని జీవితం చివరికి ఎలా మలుపు తిరుగుతుందో చూపించారు… ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది..
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ కూడా సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. అయితే గం గం గణేశా సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది చిత్ర బృందం. మే 31వ తేదీన థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు విచిత్రబృందం ప్రకటించింది.. ఆ రోజున భారీగా సినిమాలు విడుదల అవుతున్నాయి.. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..