దాచిన సొమ్ము దెయ్యాల పాలు చేసినట్లు.. కష్టపడి సంపాదించిన సొమ్మును కూడబెట్టుకునేందుకు చూస్తే.. అసలు పోయింది.. వడ్డీ పోయింది. మధ్యతరగతి కుటుంబాలు డబ్బును సంపాదించేందుకు ఎంత కష్టపడుతారో చెప్పనక్కర్లేదు. మధ్య తరగతి కుటుంబాలకు ఆఫర్ వచ్చిందంటే వస్తువులు కొనేస్తుంటారు. ఒక శాతం వడ్డీ ఎక్కువ ఇస్తామంటే.. ఆ బ్యాంకులోనే సేవింగ్స్ చేసుకుంటారు. అలాంటి ఏకంగా ఎక్కడ లేని విధంగా అధిక వడ్డీ ఇస్తామని చెబితే ఊరుకుంటారా.. ఇప్పుడూ అదే జరిగింది. అధిక వడ్డీ ఆశ చూపెట్టి బిచాం ఎత్తివేసింది శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్. వందలు.. వేలు కాదు.. ఏకంగా.. రెండు వందల కోట్లు దండుకొని పారిపోయింది జంట.. అబిడ్స్ లోని తెలంగాణ స్టేట్ కోఆపారేటివ్ బ్యాంక్ లో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాని బాల పరారీ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే..అబిడ్స్ లోని శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్ అనే సంస్థ తమ వద్ద పెట్టుబడులు పెడితే ఎక్కువ వడ్డీ ఇస్తామని ఆశ చూపి 517 మంది బాధితుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి ముఖం చాటేసింది.
దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు న్యాయం చేయాలని బషీర్‌బాగ్ సీసీఎస్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అబిడ్స్ లోని తెలంగాణ స్టేట్ కోఆపారేటివ్ బ్యాంక్ లో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాని బాల,తన భర్త మేక నేతాజీ, కొడుకు మేక శ్రీహర్షలు తమని మోసం చేసారని ఫిర్యాదులో తెలిపారు. బ్యాంక్ లో డిపాజిట్ చేయడానికి వచ్చే వినియోగదారులను ఆకర్షించి వారికి అధిక వడ్డీ ఆశచూపి అదే బ్యాంక్ సమీపంలోని తన భర్త ఆఫీస్ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ లో నిమ్మగడ్డ వాని బాల డిపాజిట్ చేయించుకున్నట్లు ఆరోపించారు.
https://www.youtube.com/watch?v=hmtVNhcxhhY