ఓటీటిలో నిత్యం ఎన్నో సినిమాలను విడుదల చేస్తుంటారు.. అందులో కొన్ని సినిమాలు మంచి వ్యూస్ ను రాబడుతున్నాయి.. దాంతో థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకే సినిమాలు ఓటీటీలో విడుదల అవుతున్నాయి. తాజాగా మరో థ్రిల్లర్ మూవీ విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి రాబోతుంది.. తెలుగు సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ ఆరంభం థియేటర్లలో రిలీజైన రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది..
ఈ సినిమా మే 10 న థియేటర్లలో విడుదలైంది.. మంచి టాక్ ను సొంతం చేసుకుంది..రెండు వారాలు కూడా గడవకముందే ఓటీటీలో రిలీజ్ అవుతోంది.. కేరాఫ్ కంచెరపాలెం సినిమాతో మోహన్ భగత్ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇందులో మిగిల్‌గా ఓ డిఫరెంట్ క్యారెక్టర్ చేశాడు..వి అజయ్ నాగ్ ఈ మూవీతో దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. . ఓ కన్నడ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు…
టీజర్స్, ట్రైలర్స్‌తో ఈ చిన్న సినిమా తెలుగు ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ కలిగించింది.. రిలీజ్ అయ్యాక అలాంటి టాక్ నే అందుకుంది.. ఇకపోతే ఈ సినిమా అంతా ఒక ఖైదీ జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు అనే దానిపై కథ ఉంటుంది.. ఒక డైరీ తో అతను గురించి కొన్ని నమ్మలేని నిజాలను తెలుసుకుంటారు.. అదే స్టోరీ.. మరి ఓటీటీలో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..