విద్యార్థులు నిరుద్యోగులు ఆందోళన చేయవద్దని రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ చిన్నారెడ్డి సూచించారు. 20 వేల డీఎస్సీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మొదటి విడుదల 11 వేల డీఎస్సీ పోస్టులు వేసామని, మరో ఆరు నెలల్లో మిగిలిన పోస్టులకు భర్తీకి డీఎస్సీ వేస్తామని ఆయన వెల్లడించారు. గత 10 ఏళ్లలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని, డీఎస్సీ వాయిదా పడకపోవచ్చు అని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలు విన్నందుకు ప్రభుత్వం సిద్ధంగా…
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అవకతవకలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తున్నారు.. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగంలోని సంక్షోభం.. ఇలా వరుసగా ఇప్పటి వరకు మూడు శ్వేతపత్రాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు మరో శ్వేత పత్రం విడుదల చేశారు. అటవీ, సహజ వనరుల, భూమి, గనుల వ్యవహారంపై సీఎం చంద్రబాబు శ్వేత పత్రం విడుదల…
రైతు రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రైతు రుణమాఫీ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (ఉమ్మడిగా “బ్యాంకులు” అని పిలువబడుతాయి) వాటి బ్రాంచ్ ల నుండి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. 12-12-2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరయిన లేక రెన్యువల్ అయిన రుణాలకు 09-12-2023 తేదీ నాటికి…
రేవంత్ కు పరిపాలన చేత కావడం లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసాం వెంకటేశ్వర్లు విమర్శలు చేశారు. ఇవాళ ఆయన బీజేపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అధికార దాహంతో చిక్కడ్ పల్లి లైబ్రరీ లో మోకాళ్ళ మీద నిలబడి నిరుద్యోగుల దగ్గర ఓట్లు అడిగారన్నారు. రేవంత్ కి జాబ్ క్యాలెండర్ దొరకలేదా? అని ఆయన ప్రశ్నించారు. నెల రోజులుగా నిరుద్యోగులను అరెస్ట్ లు చేస్తున్నారని, ఏటా 3 నుంచి 5శాతం ఉద్యోగులు రిటైర్డు అవుతారని…
వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్స్ తినడం మంచిది కాదు. ఎందుకంటే ఈ సీజన్‌లో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంది. గాలిలో తేమ పెరగడం వల్ల బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది.
మణిపూర్‌లో ఉగ్రదాడి వెలుగులోకి వచ్చింది. ఆదివారం మణిపూర్‌లోని జిరిబామ్‌లో సీఆర్పీఎఫ్, రాష్ట్ర పోలీసుల సంయుక్త బృందంపై గుర్తు తెలియని సాయుధ దుండగులు దాడి చేశారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి తర్వాత సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ర్యాలీకి హాజరైన ప్రత్యక్ష సాక్షి స్మిత్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి,డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామని హోంమంత్రి వంగల పూడి అనిత పేర్కొన్నారు. యువకుడి దాడిలో గాయపడిన కానిస్టేబుల్‌ను హోం మంత్రి అనిత పరామర్శించారు. కానిస్టేబుల్ పై మద్యం మత్తులో యువకుడు దాడి చేసిన సంగతి తెలిసిందే.
విజయనగరం జిల్లాలో నెలల పాపపై తాతయ్య అత్యాచారం కలకలం రేపింది. ఘోర ఘటనపై ప్రతి స్పందిస్తూ ఆ కామాధుడుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. అత్యాచారానికి పాల్పడిన కామాంధుడుని అరెస్టు చేశారు పోలీసులు. విజయనగరం జిల్లా రామభద్రపురం జీలికి వలస గ్రామంలో ఏడు నెలల పసికందు పై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బిడ్డకు రక్తస్రావం కావడంతో ఆసుపత్రి కి బాడంగి సిహెచ్‌సీకి తీసుకు వచ్చారు తల్లిదండ్రులు. ప్రాధమిక…