గుంటూరు జిల్లా కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రంలో అనంత శేషస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మంచి చేయాలనుకునేవారికి ఇక స్పీడ్ బ్రేకర్లు, విధ్వంసం అనేది ఉండదని, మంచి చేసే వారందరికీ ఆంధ్రప్రదేశ్ ఇక చిరునామాగా ఉంటుందన్నారు. మంచి చేసే వారంతా ఆంధ్రప్రదేశ్ లో ఇక ముందుకు రావాలన్నారు. అక్షయపాత్ర స్ఫూర్తితో అతి త్వరలోనే అన్న క్యాంటీన్లను పునః ప్రారంభిస్తామన్నారు సీఎం చంద్రబాబు. తిరుమలలో ఎన్టీఆర్ అన్నదానం…
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పన బాధ్యతను ప్రైవేటు సంస్థకు ఇవ్వాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. వచ్చే నెల చివరిలోగా టెండర్లు ఆహ్వానించాలని భావిస్తోంది. 181.5 కి.మీ మేర ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న ఈ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించనున్నారు. నిర్మాణ వ్యయం రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్లు అవుతుందని ప్రాథమిక అంచనా. ఏపీ-తెలంగాణ మధ్య ఈ హైవే వారధిలా ఉంటుంది. పండగల సమయంలోనేతై…
నేడు ముంబైకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం 4గంటలకు ముంబై వెళ్లనున్న సీఎం చంద్రబాబు ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగే శుభకార్యంలో పాల్గొననున్నారు. అంతకు ముందు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని చంద్రబాబు సందర్శించనున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా అనంత శేష ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ నిశ్చితార్థాల అనంతరం ప్రజలతో మమేకమై వారి అభ్యర్థనలను స్వీకరించేందుకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కేంద్ర కార్యాలయానికి సీఎం…
ఏపీలో ఆరోగ్య శ్రీ ట్రస్టుకు గతంలో ఉన్న ‘నందమూరి తారక రామారావు వైద్య సేవ’ పేరును ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఈ పేరును వైసీపీ అధికారంలోకి వచ్చాక ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’గా మార్చింది. ఆరోగ్యశ్రీ అనునది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు చెందిన ఒక ప్రజారోగ్య కార్యక్రమం. ఈ పథకాన్ని 2007 ఏప్రిల్ 1 న రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో అప్పటి ముఖ్యమంత్రి…
ఏపీ ప్రభుత్వం గ్యారెంటీ పెన్షన్ స్కీం-GPS చట్టాన్ని అమలు చేస్తూ గెజిట్ విడుదల చేసింది. కానీ.. ఇది టీడీపీ ప్రభుత్వం విడుదల చేసింది కాదు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసింది. అయితే ఈ జీపీఎస్‌కు సంబంధించిన ఫైల్‌పై గత నెల 12న అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఆయన సెలవుపై వెళుతూ పెండింగ్ ఫైల్స్‌పై సంతకాలు పెట్టారు. ఈ ఫైల్స్‌లో జీపీఎస్‌కు సంబంధించిన ఫైల్ కూడా ఉందట.…
కురియన్ కమిటీతో సమావేశం అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన ఒక లక్ష్యం నెరవేరిందని.. ఇంకో లక్ష్యం కేసీఆర్‌ను జైలుకు పంపడమేనని ఆయన అన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ సమాధి అయ్యిందన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను ఆధునికీకరించాలని ఆర్టీఏ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుత విధానం కంటే ప్రామాణికమైన డ్రైవింగ్ టెస్టులు నిర్వహించాలని యోచిస్తున్నారు.
ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాలను జులై 24 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి ఛైర్మన్ గురువారం మధ్యాహ్నం వివిధ శాఖల అధికారులతో అసెంబ్లీ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.
ఓ ప్రబుద్ధుడు తాను ఐఏఎస్ ఆఫీసర్ని అంటూ యువతిని బురిడీ కొట్టించి పెళ్లి చేసుకోవడంతో పాటు.. ఆమె వద్ద నుంచి రూ.2 కోట్లు వసూలు చేశాడు. మళ్లీ అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడితో పాటు అతడి తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఈసారి కేంద్ర బడ్జెట్లో సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకురావాలని.. కేంద్రమంత్రి బండి సంజయ్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. పదేళ్లుగా ప్రతి బడ్జెట్లో కేంద్రం తెలంగాణకు మొండిచెయ్యి చూపిందని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.