కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. త్వరలోనే కరోనా థర్డ్ వేవ్ విజృంభించే అవకాశాలు ఉన్నాయని కొంతమంది విశ్లేషిస్తున్నారు. మరోవైపు దేశంలోని కొన్ని రాష్ట్రాలలో నమోదవుతున్న కరోనా కేసులను చూస్తుంటే తప్పనిసరిగా మూడో వేవ్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ మూడో డోస్ కూడా తీసుకుంటే మంచిదని కొన్ని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. బూస్టర్ డోసుల వాడకంపై ఇంకా స్పష్టత రాకున్నా.. మూడో డోస్ తీసుకున్న వారిని ఇతరులతో పోల్చి చూస్తే…
దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.114కి చేరడంతో వాహనాలలో పెట్రోల్ పోయించాలంటే మిడిల్ క్లాస్ ప్రజల జేబులు ఖాళీ అయిపోతున్నాయి. అయితే పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పెట్టిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెరిగిపోతున్న పెట్రోల్ ధరల నుంచి ప్రజలు ఉపశమనం పొందాలంటే ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని సజ్జనార్ ఆ ట్వీట్‌లో కోరారు. అంతేకాకుండా హీరో మహేష్ బాబు…
ఇటీవలే ఓ దుర్మార్గుడు రూ.100 కోసం బాలుడి ప్రాణాలను గాలిలో కలిపేసిన ఘటన నిలోఫర్ ఆసుప్రతిలో చోటు చేసుకుంది. అయితే నిలోఫర్ లో బాలుడి మరణం పై ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆలస్యంగా స్పందించారు. ఘటన పై సీనియర్ డాక్టర్ల తో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. అనుమానితుడిని చర్యలు తీసుకున్నామని సూపరింటెండెంట్ వెల్లడిస్తున్నారు. ఘటనకు బాధ్యుడైన వ్యక్తి పేరును బయటపెట్టకపోవడంతో నీలోఫర్ అడ్మినిస్ట్రేషన్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కింది స్థాయి సిబ్బందితో నిలోఫర్ వైద్య అధికారులు…
టీకాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నేటి నుంచి అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ సభ్యత్వం ఇవ్వడం అంటే.. కాంగ్రెస్ కుటుంబంలో సభ్యుడు కావడమేనని అభివర్ణించారు. సభ్యత్వం తీసుకున్న వారికి 2 లక్షల ఇన్సూరెన్స్ వర్తిస్తుందని తెలిపారు. సభ్యత్వం తీసుకున్న వాళ్లంతా సోనియా గాంధీ కుటుంబ సభ్యులని, చిల్లర మల్లరా పార్టీలకు మనకు పోటీ కాదని అన్నారు. దేశ ప్రజల బానిస సంకెళ్లు తెంచిన పార్టీ కాంగ్రెస్ అని, దేశం…
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ మార్గదర్శిని ఎంచుకుందని తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు.. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిననాటి నుంచి ఆర్టీసీని ముందుకు తీసుకువెళ్లేందుకు వినూత్న రీతిలో నిర్ణయాలు తీసుకుంటూ అందరి మన్ననలు పొందుతున్నారు. తాజాగా మరో నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే బాలింతలు రద్దీగా ఉండే బస్టాండ్‌లో పసిపిల్లలకు పాలిచ్చేందుకు అనుగుణంగా ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని…
ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్మారకార్థం అవార్డులు ప్రధానత్సవ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుజాతి తరఫున అందరికి శుభాకాంక్షలు.. కేంద్రం పద్మ అవార్డులను, భారతరత్న వంటి అవార్డులతో సత్కరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి అవార్డులు ఇవ్వాలని వైఎస్ఆర్ అవార్డులు ఇస్తున్నాం’ అని అన్నారు. ‘నిండైన తెలుగుదనం నాన్నగారి పంచెకట్టులో కనిపిస్తుంది. ఆకాశమంత ఎత్తు ఎదిగిన ఆ మహామనిషి…
తెలంగాణలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి తీవ్రత గత రెండు,మూడు రోజుల నుంచి అధికమవడంతో తెల్లవారుజామున ఇంటినుంచి బయటకు రావాలంటే స్వేటర్ లేకుండా సాధ్యంకాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లోనైతే ఏకంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 12గా నమోదయ్యాయి. చలికాలం మొదట్లోనే ఈ పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో చలి తీవ్రత ఏవిధంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా వాతావరణ శాఖ విడుదల చేసిన ఉష్ణోగ్రతల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో భీంపూర్‌లో 12.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు…
భయం చాలా ప్రమాదకరమైనది. పూర్తి అవగాహన లేకుండా కొన్ని సార్లు భయపడితే ప్రాణాల మీదకే రావచ్చు.. ఏకంగా ప్రాణాలే కోల్పోవచ్చనేదానికి ఈ ఘటనే నిదర్శనం.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన పొనగంటి వేణు అనే యువకుడు సంఘమిత్ర కళాశాలలో కంప్యూటర్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఆదివారం కావడంతో నిన్న రాత్రి హుజురాబాద్ రోడ్‌లో గల అభిరామ్ బార్ ఎదురుగా ఉన్న రోడ్డు లోపల స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అటుగా వచ్చిన…
ఏపీలో గంజాయి పండుగ నడుస్తోంది. అదేంటి అనుకుంటున్నారా.. అవునండీ.. ఏపీలో రోజూ ఎక్కడోచోట గంజాయి దొరకడమే దీనికి నిదర్శనం. మత్తు పదార్థాలైన గంజాయి, డ్రగ్స్‌పై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అడుగడుగా చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహించడంతో భారీ గంజాయి వెలుగులోకి వస్తోంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో గంజాయిని పూర్తిస్థాయిలో ఆరికట్టేందుకేందు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని పోలీసులు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి సాగు తక్కువగా ఉన్నప్పటికీ, ఇక్కడ నుంచే గంజాయి రవాణా…
ఎగువ భారీ వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతోంది. ఇప్పటికే 1 క్రస్ట్ గేటును అధికారులు ఎత్తారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 58,035 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 58,035 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.90అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలకు ప్రస్తుతం నీటి నిలువ 312.0450 టీఎంసీలుగా ఉంది. ఇదిలా ఉంటే శ్రీశైలం జలాశయానికి పూర్తిగా వరద నీరు నిలిచింది. ప్రస్తుతం ఇన్…