దీపావళి పండగ సెలబ్రేట్ చేసుకునేందుకు దేశమంతా సిద్ధమైంది. దీపావళి టపాసులు కాల్చడం అంటే చిన్నారులకు ఎంతో సరదా. అందుకే దీపావళి రోజు టపాసులు కొనిపించాలని తల్లిదండ్రుల దగ్గర పిల్లలు మారం చేస్తుంటారు. కానీ ఈ వెలుగుల నింపే పండగలో కొన్ని అపశ్రుతులు కూడా జరుగుతుంటాయి. టపాసులు కాల్చే సమయంలో గాయపడటం, నిర్లక్ష్యం కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకోవడం వంటివి ప్రతి ఏడాది మనం చూస్తూనే ఉంటాం. కానీ పిల్లల చేత క్రాకర్స్ కాల్పించే సమయంలో కొన్ని జాగ్రత్తలు…
నిర్మల్ జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కొండాపూర్ బైపాస్ రోడ్డు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు నిర్మల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సు హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని నాగపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే…
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఉన్న చిన్న గుంత ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రాణాలను కబళించింది. ప్రతిరోజూ లాగే సోమవారం ఉదయం 32 ఏళ్ల మహ్మద్ యూనస్ అనే వ్యక్తి ఆఫీసుకు బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డుపై ఉన్న గుంతలో బైక్ పడటంతో అదుపుతప్పి బస్సు కింద మరణించాడు. చెన్నైలోని సైదాపేటలోని చిన్నమలై ప్రాంతంలోని అన్నాసాలై రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. బైకు రోడ్డుపై ఉన్న గుంతలో పడినప్పుడు ఎడమ వైపు…
సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా స్టువర్టుపురం-ఈపూరుపాలెం మధ్య చెన్నై వెళ్తున్న మార్గంలో రైలు పట్టా విరిగింది. రైలు పట్టా విరగడాన్ని గమనించిన రైల్వే గస్తీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే ఈ సమాచారాన్ని అధికారులకు చేరవేశారు. దీంతో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వే అధికారులు స్టువర్టుపురం స్టేషన్‌లోనే నిలిపివేశారు. దీంతో మంగళవారం అర్ధరాత్రి 1:30 గంటల నుంచి 3:30 గంటల వరకు రైలు స్టువర్టుపురం స్టేషన్‌లోనే…
దేశవ్యాప్తంగా చమురు ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరడంతో పెట్రోల్ బంకు వైపు వెళ్లాలంటే సామాన్య ప్రజలు వణికిపోతున్నారు. బుధవారం (నవంబర్ 3) కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోల్ ధర 37 పైసలు పెరిగి రూ.114.49గా ఉంది. లీటరు డీజిల్ ధర 40 పైసలు పెరిగి రూ.107.40కి చేరింది. మరోవైపు ఏపీలోని విజయవాడలో లీటరు పెట్రోల్ ధర రూ.116.61గా, లీటరు డీజిల్ ధర రూ.108.89గా…
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా పరాజయం పాలు అవుతుండటంతో అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అభిమానులు అయితే హద్దు మీరి విమర్శలు చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కుమార్తె వామికను అత్యాచారం చేస్తామని బెదిరించారు. ఈ విషయంలో విరాట్ కోహ్లీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మద్దతుగా నిలిచారు. ‘డియర్ విరాట్.. కొంతమంది మనుషులు పూర్తిగా ద్వేషంతో నిండిపోయి ఉంటారు. ఎందుకంటే వారికి ఎవ్వరూ ప్రేమను పంచరు. వాళ్లను క్షమించు. జట్టును రక్షించుకో’ అంటూ…
హుజురాబాద్ ఈటల రాజేందర్ కంచుకోట అనడంలో సందేహం లేదనిపిస్తోంది. ఎందుకంటే.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీలో చేరి హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో నిలిచారు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కేసీఆర్. ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా దళిత బంధు, మహిళలకు మహిళా సంఘాల భవనాలకు భారీ నిధుల మంజూరు లాంటి సంక్షేమ పథకాలను హుజురాబాద్ ఓటర్ల ముందు…
హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదట 753 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అధికారులు టీఆర్ఎస్కు ఆధికంగా ఓట్లు వచ్చినట్లు తెలిపారు. అనంతరం ఈవీంఏంలలోని ఓట్లను లెక్కింపును ప్రారంభించారు. మొత్తం 22 రౌండ్లు నిర్వహించనుండగా.. తొలి రౌండ్లో బీజేపీ తన ఆధిక్యాన్ని చాటుకుంది. మొదటి రౌండ్ లో 166 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లీడ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. తొలిరౌండ్లో బీజేపీకి 4,610…
హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ప్రారంభమైంది. అధికారులు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతోనే టీఆర్ఎస్ తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 753 బ్యాలెట్ ఓట్లను లెక్కించగా అందులో టీఆర్ఎస్కు ఓట్లు ఆధికంగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లలో 503 టీఆర్ఎస్ కు రాగా, బీజేపీకి 159, కాంగ్రెస్ కు 32 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అనంతరం హుజురాబాద్ ఓట్లను…
జగన్ సర్కార్ ఆధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీంతో అమరావతి అభివృద్ధికి భూములిచ్చి రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో 45 రోజుల మహా పాదయాత్రకు రాజధాని రైతులు శ్రీకారం చుట్టారు. ఈ పాదయాత్ర నవంబర్ 1 నుంచి ప్రారంభమైంది. నేడు రెండవ రోజు పాదయాత్రను ప్రారంభించనున్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తాడికొండ నుండి గుంటూరు శివారు ప్రాంతం వరకు 12.6 కిలో మీటర్ల…