ఏపీలో గంజాయి పండుగ నడుస్తోంది. అదేంటి అనుకుంటున్నారా.. అవునండీ.. ఏపీలో రోజూ ఎక్కడోచోట గంజాయి దొరకడమే దీనికి నిదర్శనం. మత్తు పదార్థాలైన గంజాయి, డ్రగ్స్‌పై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అడుగడుగా చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహించడంతో భారీ గంజాయి వెలుగులోకి వస్తోంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో గంజాయిని పూర్తిస్థాయిలో ఆరికట్టేందుకేందు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని పోలీసులు చెబుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి సాగు తక్కువగా ఉన్నప్పటికీ, ఇక్కడ నుంచే గంజాయి రవాణా జరుగుతోందని, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో పాటు విశాఖ కేంద్రంగా గంజాయి సాగు అధికంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసులు ఫోకస్ చేయడంతో అప్రమత్తమైన గంజాయి స్మగ్లర్లు కొత్తపంథాను ఎంచుకుంటున్నారు. అనేక రకాలుగా గంజాయిని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు.
తాజాగా అనంతగిరి మండలం కాశీపట్నం సమీపంలో బొలోరో వాహనంలో తరలిస్తున్న700 కేజీల గంజాయిని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో వాహనం సీజ్ చేసినట్లు నిందితులు పరారీలో ఉన్నట్లు వారు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 70 లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.