Home
Latest News
Latest News News
-
ఏపీలో ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏపీలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు పంపిణీకి జగన్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. భారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామనే విషయాన్ని కరపత్రాల రూపంలో ప్రజలకు ప్రభుత్వం వివరించనుంది. ప్రణాళిక శాఖ దీనికోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరాల్ని ఇంటింటికి పంపిణీ చేయడానికి కసరత్తు పూర్తి చేసింది. ప్రభుత్వ పథకాలు స్టేటస్ రిపోర్టులు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్లకు… -
బేగంపేట పేకాట కేసులో ట్విస్ట్.. సుమన్‌ను తలపిస్తున్న అగర్వాల్ తీరు..
హీరీ నాగశౌర్యకు చెందిన ఓ ఫాంహౌస్‌లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేయగా గుత్తా సుమన్ అనే వ్యక్తి ఫాం హౌస్‌లు లీజుకు తీసుకొని క్యాసినో నిర్వహిస్తున్నట్లు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో విచారణ కొనసాగుతుండగా బేగంపేటలో పేకాట ఆడుతూ పట్టుబడ్డారు మరికొందరు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. అరవింద్ అగర్వాల్ అనే వ్యక్తి ప్రతి పండుగ లకు ముఖ్యమైన రోజుల్లో క్యాసినో నిర్వహిస్తున్నట్లు,… -
ఘరానా మోసగాళ్లు.. క్రిప్టో కరెన్సీ పేరుతో 85 లక్షలు టోకరా..
నేటి సమాజంలో పెరుగుతున్న టెక్నాలజీని మంచికి ఎంతో మంది ఉపయోగిస్తుంటే.. కొందరు మాత్రం టెక్నాలజీని వాడి మోసాలకు పాల్పడుతున్నారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే మీ డబ్బులు ఎక్కువ అవుతాయంటూ నమ్మబలికి సామాన్యుల జేబుకు చిల్లుపెడుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వెస్ట్ బెంగాల్‌కు చెందిన ముగ్గురు నారపల్లికి చెందిన ఓ వ్యక్తికి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే చాలా డబ్బులు వస్తాయని చెప్పి రూ.85 లక్షల వరకు స్వాహా చేశారు. తీరా… -
రేపు ఏపీ వ్యాప్తంగా బీజేపీ నిరసనలు
ఏపీ వ్యాప్తంగా రేపు బీజేపీ నిరసన చేపట్టేందుకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పిలుపునిచ్చారు. దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర సుంకం తగ్గించిన విషయం తెలిసిందే. కేంద్ర నిర్ణయానికి మద్దతుగా బీజేపీ పాలిత ప్రాంతాలతో పాటు మరొ కొన్ని రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర సుంకాన్ని తగ్గించాయి. ఈ నేపథ్యంలో ఏపీలోనూ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై సుంకాన్ని తగ్గించాలని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు డిమాండ్ చేశారు.… -
మందుబాబులకు సూపర్ న్యూస్.. డ్రంక్&డ్రైవ్ లో పట్టుబడితే వాహనం సీజ్ చేయరట
తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మద్యం సేవించి పట్టుబడిన వారి వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా మద్యం సేవించి పట్టుబడిన వారి వెంట మద్యం సేవించనివారేవరైనా ఉంటే వారికి వాహనాన్ని అప్పగించాలని సూచించింది. మద్యం తాగిన వారి వెంట ఎవరూ లేకపోతే ఆ వ్యక్తికి సంబంధించిన బంధువులను పిలిచి వాహనం ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. ఎవరూ రాకపోతే వాహనం పీఎస్‌కు తరలించి… -
నేలరాలిన మరో నిరుద్యోగి.. యాసిడ్ తాగి ఆత్మహత్య..
తెలంగాణలో మరో నిరుద్యోగి నేలకొరిగాడు. ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని మనస్థాపానికి గురై ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం పుప్పాల్‌గూడకు చెందిన మహ్మద్ అజాజ్ అనే యువకుడు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌లు విడుదల కాకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. అంతేకాకుండా ఉద్యోగం లేకుండా కుటుంబ పోషణ భారమవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన అజాజ్ యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా అజాజ్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
వైద్యం వికటించి మహిళ మృతి.. 2 లక్షలు కడితేనే మృతదేహం అంటున్న వైనం..
వైద్యం వికటించి మహిళ ప్రాణాలు కోల్పోయిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓజోన్ హాస్పిటల్ లో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం రాందిగల్ల గ్రామానికి చెందిన ఈదుల అంజనమ్మ (35), ఈదుల కృష్ణయ్య భార్యభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. భర్త కృష్ణయ్య ఆటో నడుపుతూ జీవనం సాగిస్తూ ఉండగా, అంజనమ్మ వ్యవసాయ కూలీలకు వెళ్తూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటుంది. కాగా అంజనమ్మకు 3 నెలల క్రితం వ్యవసాయ కూలీ పనులు చేస్తుండగా కాలికి… -
శ్రీశైలంలో కార్తీకమాస శోభ.. భక్తులతో ఆలయం కిటకిట..
కార్తీక మాసం లయకారుడు శివుడికి ఎంతో ప్రీతికరమైన నెల. ఈ నెలలో పెద్ద ఎత్తున్న భక్తులు శివాలయాలను దర్శించుకుంటుంటారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఈ రోజు భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనానికి విచ్చేసిన భక్తులతో ఆలయం కిటికిటలాడింది. నేటి నుంచి డిసెంబర్ 4 వరకు కార్తీక మాస ఉత్సవాలు కొనసాగనున్నాయి. స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన… -
చెట్టులెక్కగలవా ఓ నరహరి.. గంగిరెద్దులకు ఫోన్ పే చేయగలవా.. వీడియో వైరల్
దేశంలో డిజిటల్ విప్లవం ఎంతవరకు సాధ్యమైంది ఈ వీడియో ను చూసి మనం తెలుసోవచ్చు. దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు చేసేందుకు ప్రధాని మోడీ డిజిటల్ విప్లవానికి తెర లేపిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ఏ చిన్న కిరాణా కొట్టు, పాన్, టీ స్టాల్ ఇలా చిన్న చిన్న వ్యాపారులు సైతం డిజిటల్ చెల్లింపుపై ఆసక్తి చూపుతున్నారు. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల్లో పండుగలకు ఇంటిముందుకు గంగిరెద్దులను తీసుకువచ్చి ఆటలాడిస్తుంటారు. అలా వచ్చిన వారికి బియ్యంతో… -
ఏపీలో రంగంలోకి దిగిన డాగ్ స్వ్కాడ్
ఏపీలో ఎక్కడ వాహనాలు తనిఖీలు చేపట్టినా భారీగా గంజాయి దొరుకుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తమైన పోలీసులు అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. అనుమాన వచ్చిన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ కేంద్రంగా సుమారు 6 కోట్లు విలువ చేసే నిషేదిత గంజాయిని పట్టుకున్నట్లు సీపీ బత్తిన శ్రీనివాసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. Read Also : వీడియో : స్కూటీపై టపాసులు తీసుకెళ్లుండగా పేలుడు.. తండ్రికొడుకులు దుర్మరణం.. ఈ నేపథ్యంలో గంజాయి రవాణాను అరికట్టేందుకు…
తాజావార్తలు
-
Priyanka Gandhi: ‘‘ అత్యాచార నిందితులకు మద్దతు’’.. ప్రహ్లాద్ జోషిపై ప్రియాంకాగాంధీ సంచలన వ్యాఖ్యలు..
-
Kalyana Lakshmi: కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ కోసం అడ్డదారులు.. గుట్టురట్టు చేసిన పోలీసులు..
-
Rahul Gandhi: ‘అత్యంత నీచమైన వ్యక్తి’.. కొత్త విద్యాశాఖ మంత్రిపై రాహుల్ గాంధీ ఫైర్
-
Kitchen Cleaning Hacks: మిక్సర్ బేస్ శుభ్రం చేసే బెస్ట్ ట్రిక్స్.. మురికి, దుర్వాసనకు గుడ్‌బై
-
Allu Arjun: అభిమానుల కోసం బన్నీ స్పెషల్ గిఫ్ట్.. 900 మందికి ఊహించని సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!