దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి వాయు కాలుష్యం గుబులు రేపుతోంది. గాలి నాణ్యత పడిపోవడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఆనంద్ విహార్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 352గా నమోదైంది. అలాగే ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ 300 కంటే ఎక్కువగా నమోదైంది. అయితే దీపావళి నేపథ్యంలో గాలి నాణ్యత సూచీ మరింత దిగజారే అవకాశముందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫ్ ఇండియా…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఇంత హడావిడిగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. దీపావళి పండుగ రోజు నామినేషన్లు వేయడమేంటని నిలదీశారు. దీపావళి పండగ కూడా జరుపుకోనివ్వకుండా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేయడం లేదని… దీపావళి పండగ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తే…
దేశాన్ని మరోసారి జికా వైరస్ వణికిస్తోంది. ముఖ్యంగా యూపీలో జికా వైరస్ కారణంగా పలువురు మృత్యువాత పడుతున్నారు. బుధవారం ఒక్కరోజే యూపీలో 25 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఆరుగురు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన వ్యక్తులు, 14 మంది మహిళలు ఉన్నారు. యూపీలో ఎక్కువగా కాన్పూర్ ప్రాంతంలో జికా వైరస్ కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 23న కాన్పూర్‌లో తొలి జికా వైరస్ వెలుగు చూసింది. Read Also: మార్కెట్‌లోకి బఫర్ స్టాక్.. తగ్గిన ఉల్లి…
దీపావళి పండగను స్టార్ హీరోలు అల్లు అర్జున్, రామ్‌చరణ్ ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. బన్నీ షేర్ చేసిన ఫోటోలో అంతా యంగర్ జనరేషన్ కనిపిస్తోంది. అల్లు అర్జున్-స్నేహ, రామ్‌చరణ్-ఉపాసన, నిహారిక-చైతన్య, వైష్ణవ్ తేజ్, అల్లు బాబీతో పాటు పలువురు మెగా కుటుంబసభ్యులు కనిపిస్తున్నారు. అయితే ఈ ఫొటోలో యంగ్ హీరో సాయి తేజ్ మాత్రం కనపడలేదు.…
గత నెలలో ఉల్లిపాయల ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపించాయి. ప్రస్తుతం ఉల్లిపాయల ధరలు తగ్గుముఖం పట్టినా కిలో రూ.40కి పైగానే పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉల్లి ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారీ వర్షాల కారణంగా అక్టోబర్ మొదటి వారం నుంచి ఉల్లిపాయల ధరలు పెరుగుతున్నాయని.. దీంతో తాము బఫర్ నిల్వల నుంచి ఉల్లిని సరఫరా చేస్తుండటంతో ధరలు దిగి వస్తున్నాయని కేంద్రం తెలిపింది. బఫర్ స్టాక్ నుంచి ఢిల్లీ, కోల్‌కతా, లక్నో,…
ఓ వార్డు వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వార్డు వాలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రవి కుమార్ అనే వ్యక్తి తాడేపల్లిలో నిన్నటి నుంచి కనిపించడం లేదు. అయితే రవికుమార్ ఈ రోజు నదిలో శవమై కనిపించాడు. దీంతో రవికుమార్ శవాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేయడంతో అతడు వాలంటీర్ రవికుమార్‌గా గుర్తించారు. అంతేకాకుండా అతడి వద్ద సూసైడ్ నోట్ కూడా లభ్యమైనట్లు పోలీసులు…
భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీవో) దేశీయంగా అభివృద్ధి చేసిన స్మార్ట్ యాంటీ ఎయిర్‌ఫీల్డ్ వెపన్ ను ఇండియాన్ ఎయిర్‌ఫోర్స్‌తో కలిసి విజయవంతంగా పరీక్షించాయి. వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల బంకర్లు, రాడార్లతో పాటు రన్‌వేలు, ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్లను, రీన్ ఫోర్స్ నిర్మాణాలను ఈ మిస్సైల్ ధ్వంసం చేస్తుంది. దీనిలో ఉన్న ఎలక్ట్రో ఆప్టికల్, శాటిలైట్ నావిగేషన్ సెన్సార్ల ఆధారంగా రెండు వేర్వేరు కాన్ఫిగరేషన్లను విజయవంగా పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. శాస్త్రవేత్తలు ఐఐఆర్ (ఇమేజింగ్…
భారత ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు తరువాత ఏ అభ్యర్థి విజయోత్సవ ర్యాలీలు తీయడానికి వీళ్లేదని ఎన్నికల అధికారులు నిబంధనలు జారీ చేశారు. అయితే నిన్న ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన తరువాత బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల నుంచి కోర్టు చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారని తెలుపుతూ ఈటల రాజేందర్‌తో పాటు…
ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో సులక్షణ నాయక్, మిస్టర్ ఆర్పి సింగ్‌లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ బుధవారం రాహుల్ ద్రవిడ్‌ను టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా ఏకగ్రీవంగా నియమించింది. న్యూజిలాండ్‌తో జరగనున్న సిరీస్‌లో రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రవిశాస్త్రి (మాజీ టీమ్ డైరెక్టర్ & హెడ్ కోచ్), బి. అరుణ్ (బౌలింగ్ కోచ్), ఆర్. శ్రీధర్ (ఫీల్డింగ్ కోచ్), విక్రమ్…
రోజురోజు పెట్రోల్ ధరలు ఆకాశానంటుతున్నాయంటూ వాహనదారులు ప్రభుత్వాలపై మండిపడుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. లీటర్ పెట్రోల్ ధరపై రూ.5, లీటర్ డిజీల్ ధరపై రూ.10 ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తగ్గించిన ధరలు రేపటి నుంచి అమలులో ఉండనున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.