Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్‌తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bajaj Chetak Sales Surge 307 Percent: ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో బజాజ్ చేతక్ దూసుకెళ్తోంది. కంపెనీకి జూలై నెలలో చేతక్ అమ్మకాలు భారీగా పెరిగాయి. గత ఏడాది జూలైతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో చేతక్ విక్రయాలు ఏకంగా 307 శాతం పెరిగాయి. జూన్‌తో పోల్చినా జూలైలో అమ్మకాలు 17 శాతం వృద్ధి సాధించడం విశేషం. జూలైలో బజాజ్ మొత్తం 47,184 చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో 11,584 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే ఏడాది వ్యవధిలో అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. జూన్‌లో 40,376 చేతక్ స్కూటర్లు విక్రయించగా, జూలైలో ఆ సంఖ్య 47,184కు చేరింది.
ఒకప్పుడు భారతీయుల అభిమాన స్కూటర్‌గా నిలిచిన బజాజ్ చేతక్.. ఆటోమేటిక్ స్కూటర్ల రాకతో మార్కెట్లో తన ప్రాభవాన్ని కోల్పోయింది. అయితే 2019లో బజాజ్ సంస్థ చేతక్‌ను మళ్లీ భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈసారి పెట్రోల్ ఇంజిన్‌కు బదులుగా ఎలక్ట్రిక్ స్కూటర్‌గా పరిచయం చేసింది. ప్రస్తుతం చేతక్ ఎలక్ట్రిక్ విభాగంలో బజాజ్‌కు కీలకమైన ఉత్పత్తిగా మారుతోంది. చేతక్ ప్రస్తుతం పలు బ్యాటరీ, రేంజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. చేతక్ C2501 బేస్ మోడల్ 2.5kWh బ్యాటరీతో వస్తుంది. ఇది 113 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంటోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.91,504 నుంచి ప్రారంభమవుతుంది.
Also Read
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
ఇక చేతక్ C3001 3.0kWh బ్యాటరీతో 131 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1,14,270గా ఉంది. మరోవైపు చేతక్ 35 సిరీస్ 3.5kWh బ్యాటరీతో వస్తుంది. ఇది 153 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ మోడల్ ప్రారంభ ధర రూ.1,24,157 ఎక్స్-షోరూమ్‌గా ఉంది. చేతక్ 35 సిరీస్ నిర్వహణ ఖర్చు కూడా తక్కువగా ఉంటుందని కంపెనీ పేర్కొంటోంది. 3.5kWh బ్యాటరీని ఇంట్లో పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు రూ.35 ఖర్చవుతుందని అంచనా. ఈ లెక్కన సుమారు రూ.35 విద్యుత్ ఖర్చుతో 153 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.
బజాజ్ చేతక్ అమ్మకాల్లో నమోదవుతున్న ఈ భారీ వృద్ధి.. భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న ఆదరణను కూడా సూచిస్తోంది. రేంజ్, తక్కువ నిర్వహణ వ్యయం, పాత చేతక్ బ్రాండ్‌పై ఉన్న నమ్మకం వంటి అంశాలు ఈ స్కూటర్‌కు డిమాండ్ పెరగడానికి కారణాలుగా నిలుస్తున్నాయి.
తాజావార్తలు
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!