మహరాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. అహ్మద్‌నగర్ జిల్లా ఆసుపత్రి ఐసీయూలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐసీయూలో కరోనా వార్డులో 17 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. వారిలో ఆరుగురు మృతి చెందగా.. మరో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అందుపులోకి తీసుకువచ్చాయి. షాట్ సర్య్కూట్ కారణంగా ఈ…
మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ బాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సాధించింది. తెలుగు చిత్రాల్లో కూడా గెస్ట్ రోల్, ఐటెం సాంగ్‌లకు పరిమితమైన సన్నీ.. మరింత డబ్బు సంపాదించేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ బిగ్ బీ అమితామ్ బచ్చన్ లు అడుగుపెట్టిన నాన్ ఫంజిబుల్ టోకెన్ (ఎన్‌ఎఫ్‌టీ) రంగంలోకి సన్నీ కూడా ప్రవేశించింది. ఇవి ఫోటోలు, డిజిటల్ ఆస్తలు, ఆడియోలు, వీడియోలు సహా ఇతర ఫార్మాట్లలోని డిజిటల్…
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏపీలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు పంపిణీకి జగన్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. భారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామనే విషయాన్ని కరపత్రాల రూపంలో ప్రజలకు ప్రభుత్వం వివరించనుంది. ప్రణాళిక శాఖ దీనికోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరాల్ని ఇంటింటికి పంపిణీ చేయడానికి కసరత్తు పూర్తి చేసింది. ప్రభుత్వ పథకాలు స్టేటస్ రిపోర్టులు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్లకు…
హీరీ నాగశౌర్యకు చెందిన ఓ ఫాంహౌస్‌లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేయగా గుత్తా సుమన్ అనే వ్యక్తి ఫాం హౌస్‌లు లీజుకు తీసుకొని క్యాసినో నిర్వహిస్తున్నట్లు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో విచారణ కొనసాగుతుండగా బేగంపేటలో పేకాట ఆడుతూ పట్టుబడ్డారు మరికొందరు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. అరవింద్ అగర్వాల్ అనే వ్యక్తి ప్రతి పండుగ లకు ముఖ్యమైన రోజుల్లో క్యాసినో నిర్వహిస్తున్నట్లు,…
నేటి సమాజంలో పెరుగుతున్న టెక్నాలజీని మంచికి ఎంతో మంది ఉపయోగిస్తుంటే.. కొందరు మాత్రం టెక్నాలజీని వాడి మోసాలకు పాల్పడుతున్నారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే మీ డబ్బులు ఎక్కువ అవుతాయంటూ నమ్మబలికి సామాన్యుల జేబుకు చిల్లుపెడుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వెస్ట్ బెంగాల్‌కు చెందిన ముగ్గురు నారపల్లికి చెందిన ఓ వ్యక్తికి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే చాలా డబ్బులు వస్తాయని చెప్పి రూ.85 లక్షల వరకు స్వాహా చేశారు. తీరా…
ఏపీ వ్యాప్తంగా రేపు బీజేపీ నిరసన చేపట్టేందుకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పిలుపునిచ్చారు. దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర సుంకం తగ్గించిన విషయం తెలిసిందే. కేంద్ర నిర్ణయానికి మద్దతుగా బీజేపీ పాలిత ప్రాంతాలతో పాటు మరొ కొన్ని రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర సుంకాన్ని తగ్గించాయి. ఈ నేపథ్యంలో ఏపీలోనూ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై సుంకాన్ని తగ్గించాలని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు డిమాండ్ చేశారు.…
తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మద్యం సేవించి పట్టుబడిన వారి వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా మద్యం సేవించి పట్టుబడిన వారి వెంట మద్యం సేవించనివారేవరైనా ఉంటే వారికి వాహనాన్ని అప్పగించాలని సూచించింది. మద్యం తాగిన వారి వెంట ఎవరూ లేకపోతే ఆ వ్యక్తికి సంబంధించిన బంధువులను పిలిచి వాహనం ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. ఎవరూ రాకపోతే వాహనం పీఎస్‌కు తరలించి…
తెలంగాణలో మరో నిరుద్యోగి నేలకొరిగాడు. ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని మనస్థాపానికి గురై ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం పుప్పాల్‌గూడకు చెందిన మహ్మద్ అజాజ్ అనే యువకుడు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. అంతేకాకుండా ఉద్యోగం లేకుండా కుటుంబ పోషణ భారమవడంతో డిప్రెషన్లోకి వెళ్లిన అజాజ్ యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా అజాజ్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వైద్యం వికటించి మహిళ ప్రాణాలు కోల్పోయిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓజోన్ హాస్పిటల్ లో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం రాందిగల్ల గ్రామానికి చెందిన ఈదుల అంజనమ్మ (35), ఈదుల కృష్ణయ్య భార్యభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. భర్త కృష్ణయ్య ఆటో నడుపుతూ జీవనం సాగిస్తూ ఉండగా, అంజనమ్మ వ్యవసాయ కూలీలకు వెళ్తూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటుంది. కాగా అంజనమ్మకు 3 నెలల క్రితం వ్యవసాయ కూలీ పనులు చేస్తుండగా కాలికి…
కార్తీక మాసం లయకారుడు శివుడికి ఎంతో ప్రీతికరమైన నెల. ఈ నెలలో పెద్ద ఎత్తున్న భక్తులు శివాలయాలను దర్శించుకుంటుంటారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఈ రోజు భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనానికి విచ్చేసిన భక్తులతో ఆలయం కిటికిటలాడింది. నేటి నుంచి డిసెంబర్ 4 వరకు కార్తీక మాస ఉత్సవాలు కొనసాగనున్నాయి. స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన…