యావత్తు ప్రపంచాన్నే కరోనా మహమ్మరి అతలాకుతలం చేసింది. కరోనా బారినపడి ఎంతో మంది జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. కరోనా కారణంగా ఎన్నో కుటుంబాలు విచ్చినమయ్యాయి. కుటుంబ పెద్దలు కరోనా సోకి మరణించడంతో ఎంతో మంది చిన్నారులు అనాథలుగా మారారు. ప్రపంచ విపత్తుగా కరోనా కాలాన్ని చెప్పుకోవచ్చు. అయితే ఈ కరోనా నుంచి బయట పడేందుకు దేశాలు తమతమ శాస్త్రవేత్తలు కనుగొన్న కోవిడ్ టీకాలను ప్రజలకు పంపిణీ చేస్తూ కరోనా కట్టడికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా కోవిడ్ చికిత్స కోసం…
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ల కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 7న సంక్రాంతి వేడుకలకు మరింత ఉత్సహాంగా జరుపుకునేందుకు చిత్ర యూనిట్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ రోజు దీపావళి కానుకగా ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్ గ్లింప్స్’ అంటూ ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు…
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పామర్రు మండలం కాపవరం వద్ద ఓ కారు అదుపుతప్పి డివైడర్ దాటి బైక్ ను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు దగ్డమైంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మొవ్వ మండలం కాజా గ్రామానికి చెందిన కామేశ్వర రెడ్డి…
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎం.కే స్టాలిన్ అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ముందుకు వెళుతున్నారు. ఆ మధ్య అర్థరాత్రి ఓ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సీఎం స్టాలిన్, ఇటీవల ఓ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అందరినీ అవాక్ చేశారు. అంతేకాకుండా మొన్నటికి మొన్న రోడ్డుపై తన కాన్వాయ్ వెళ్తుండగా వెనుకనుంచి వస్తున్న అంబులెన్స్‌కు సైడ్ ఇచ్చి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఇలా ఊహించని రీతిలో తనదైన శైలితో సీఎం స్టాలిన్ ముందుకు…
రేపు ఏపీ బంద్‌కు రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. విజయనగరంలోని లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ ముందు చెరకు రైతులు బకాయిలు చెల్లించాలంటూ బుధవారం నిరసనకు దిగారు. వారిని అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై రైతులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘర్ణణలో ఆరుగురు రైతులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో గురువారం రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రేపు ఏపీ బంద్‌కు పిలునిచ్చారు. రైతులందరూ బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
జికా వైరస్ యూపీని కలవరపెడుతోంది. జికా వైరస్ బారినపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. యూపీలోని కాన్పూర్ ప్రాంతంలోని ప్రజలే ఈ జికా వైరస్ బారినపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం వరకు 25గా ఉన్న బాధితుల సంఖ్య తాజాగా 36కు చేరింది. పురపాలక శాఖ, ఆరోగ్య శాఖ అధికారులు జికా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు. ఇంటింటికి తిరిగి ఈ వైరస్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించేందుకు ఆశా వర్కర్లను కేటాయించారు. అంతేకాకుండా 150 ప్రత్యేక…
శంషాబాద్ నుంచి బెంగళూరు వైపుకు వెళ్లె జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్‌కు చెందిన డాక్టర్ మరో ఇద్దరితో కలిసి జాతీయ రహదారిపై కారులో ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు వెళుతున్న బస్సు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో బస్సు వెనకాల నుంచి కారు ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందడంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రంగారెడ్డి…
సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దీపావళి పండుగ పురస్కరించుకొని దేశ ప్రజలకు బహుమతిగా పెట్రోల్ డీజిల్ ధరల పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని డీకే అరుణ అన్నారు. Also Read : హైదరాబాద్ కు ఈటల.. సిద్ధిపేటలో ఆగి ఏం చేశారంటే.. కేంద్ర ప్రభుత్వం…
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మరి తన ప్రభావాన్ని చూపుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో కరానోనా తగ్గుముఖం పడుతోంది. తాజాగా రాష్ట్రంలో 36,373 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 301 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారనైంది. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో ఇద్దరు కరోనా బారినపడి మృతి చెందగా.. 367 మంది కరోనా నుంచి కొలుకున్నారు. ప్రస్తుతం రాష్రంలో 3,830 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం కలకలం రేపుతోంది.కల్తీ మద్యం తాగి 9 మంది మృతి చెందిన విషాద సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బీహార్ రాష్ట్రంలోని గోపాల్‌గంజ్ జిల్లాలో కల్తీ మద్యం తాగి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ కొందరు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందారు. మరి కొందరు ఇంట్లోనే మరణించారు. ఇలా 9 మంది మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.…