తెలంగాణలో మరో నిరుద్యోగి నేలకొరిగాడు. ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని మనస్థాపానికి గురై ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం పుప్పాల్‌గూడకు చెందిన మహ్మద్ అజాజ్ అనే యువకుడు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌లు విడుదల కాకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు.
అంతేకాకుండా ఉద్యోగం లేకుండా కుటుంబ పోషణ భారమవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన అజాజ్ యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా అజాజ్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.