బేగంపేట పేకాట కేసులో ట్విస్ట్.. సుమన్‌ను తలపిస్తున్న అగర్వాల్ తీరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరీ నాగశౌర్యకు చెందిన ఓ ఫాంహౌస్‌లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేయగా గుత్తా సుమన్ అనే వ్యక్తి ఫాం హౌస్‌లు లీజుకు తీసుకొని క్యాసినో నిర్వహిస్తున్నట్లు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో విచారణ కొనసాగుతుండగా బేగంపేటలో పేకాట ఆడుతూ పట్టుబడ్డారు మరికొందరు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. అరవింద్ అగర్వాల్ అనే వ్యక్తి ప్రతి పండుగ లకు ముఖ్యమైన రోజుల్లో క్యాసినో నిర్వహిస్తున్నట్లు, నగరంలోని వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులతో అరవింద్ అగర్వాల్ కు పరిచయాలు ఉన్నట్లు తెలుస్తోంది.
క్యాసినో నిర్వహించే ముందు అరవింద్ అగర్వాల్ ప్రముఖులకు ఇన్విటేషన్స్ పంపుతున్నట్లు, వాట్సాప్ లో ఇన్విటేషన్ తో పాటు లొకేషన్ షేర్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అరవింద్ అగర్వాల్ ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. అరవింద్ అగర్వాల్ ఫోన్లో రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, బడా వ్యాపారవేత్తలు లిస్టు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అరవింద అగర్వాల్ తో పాటు నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read
అరవింద్ అగర్వాల్ వెనకాల నగరానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు ఉన్నట్లుగా సమాచారం. రాజకీయ నాయకుడి అండదండలతో అగర్వాల్ స్వేచ్ఛగా పేకాట నిర్వహిస్తున్నాడని, స్థానికులు ఇచ్చిన సమాచారంతో బేగంపేట పేకాట అడ్డ పై పోలీసుల ఏకకాలంలో సోదాలు నిర్వహించనట్లు తెలిపారు. ఈ దాడుల్లో 30 మందికి పైగా పేకాటరాయుళ్లను పోలీసులు పట్టుకున్నారు. భారీ మొత్తంలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?