గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మరణించారు. వీరిలో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు. అయితే ఘటన స్థలం నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు మిళింద్ కూడా ఉండటం గమనార్హం. మృతుడు మిళింద్‌పై రూ.50లక్షల రివార్డు ఉంది. ఎన్ కౌంటర్‌లో మరణించిన మావోయిస్టులకు సంబంధించిన ఆయుధాలను, వస్తువులను పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు ఎన్టీవీ ఎక్స్‌క్యూజివ్‌గా..
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల కోసం ఓ విషయాన్ని ప్రకటించింది. 6 రోజుల పాటు రాత్రి పూట రిజర్వేషన్ సౌకర్యం లేదని దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 5.30 గంటల వరకు రిజర్వేషన్ ఉండదని స్పష్టం చేసింది. నేటి రాత్రి నుంచి 20వ తేదీ వరకు సేవలకు అంతరాయం కలుగుతుందని ఇది ప్రయాణికులు గమనించాలని కోరింది. అంతేకాకుండా కరెంట్ బుకింగ్, టికెట్ల రద్దు సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. రైల్వే డేటా…
ఏపీలో పురపోరు ముగిసింది. నెల్లూరు కార్పోరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 36 సర్పంచ్‌లకు, 68 పంచాయతీ వార్డు మెంబర్ స్థానాలకు మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించారు. అనంతరం కౌంటింగ్ కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పుల్లయ్యగూడెం సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరచిన చీకట్ల పుష్ప లక్ష్మీకుమారి 60ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. విశాఖపట్నం కొయ్యూరు మండలం బాలవరం సర్పంచ్ గా…
తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారం కావాలని, దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. తెలుగు రాష్ట్రాల విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు అమలు కావడంలేదన్నారు. సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయని, వీటితో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013–14 ధరల సూచీతో రాష్ట్రానికి…
రేణిగుంట ఎయిర్‌పోర్టు సమీపంలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. తిరుపతిలో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో పాల్గొనడానికి ఏపీ సీఎం జగన్ తిరుపతికి రానున్నారు. ఈ నేపథ్యంలో రేణిగుంట ఎయిర్‌పోర్టు చేరుకున్న జగన్.. తన కాన్వాయ్‌లో తిరుపతికి బయలుదేరారు. అయితే అలా మొదలై సీఎం కాన్వాయ్ వెంబడి ఓ మహిళ పరిగెత్తుతూ వచ్చింది. ఇది గమనించిన సీఎం జగన్ కాన్వాయ్‌కి నిలిపివేయించి.. ఓఎస్డీని ఆ మహిళ దగ్గరకు పంపించారు. అంతేకాకుండా ఆ మహిళ…
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి లిఫ్ట్ కూలింది. ఆ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి మంత్రి హరీష్ రావు, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌లు హజరయ్యారు. అయితే ప్రమాద సమయంలో నేతలేవరు లిఫ్ట్‌లో లేరు. కానీ.. లిఫ్ట్‌లో ప్రయాణిస్తున్న కొంతమంతి గాయాలయ్యాయి. లోడ్ ఎక్కువ కావడంతో లిఫ్ట్ కూలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
విశాఖ జిల్లా సింహాచలంలోని వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం రోజు ఓ పాము భక్తులను హడలెత్తించింది. ఆలయ ప్రాంగణంలో పూజా సామాగ్రి దుకాణంలోకి పాము దూరడంతో వెంటనే ఆలయ సిబ్బంది పాములు పట్టుకునే ఆలయ ఉద్యోగి కిరణ్‌కు సమాచారం ఇచ్చారు. అతడు రంగంలోకి దిగి చాకచాక్యంగా పామును పట్టుకుని బంధించడంతో ఆలయ అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. Read Also: వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు… లోకేష్ ఓ ఆరిపోయే దీపం ! గతంలోనూ సింహాచలం…
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీరు రంగులు మార్చే ఊసరవెల్లి మాదిరిగా ఉందని బీజేపీ మహిళా నేత విజయశాంతి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాజా పరిస్థితిని గమనిస్తే…. కేంద్రం వద్ద బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) నిల్వలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి… వాటిని వినియోగించేందుకు కొన్నేళ్లు పడుతుంది కనుక… 2020-21 యాసంగి సీజన్‌కు సంబంధించి తెలంగాణ నుంచి 24.75 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ మాత్రమే ఎఫ్‌సీఐ తీసుకుంటుంది. మిగిలిన బియ్యం రా రైస్ (పచ్చి…
ఏపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో భర్తీ కానున్న 11 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రకటించారు. మొత్తం 14 లో 7 ఓసీలకు, 7 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఇదే ఆఖరు కాదని, ఇప్పుడు సర్దుబాటు చేయలేక పోయిన వారికి…
విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మెంటాడ మండలంలోని జక్కువ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలోని కోట పోలినాయుడు అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ లీక్ అవడంతో మంటలు చేలరేగాయి. దీంతో ఒక్కసారి మంటల ఎగిసిపడ్డాడడంతో పక్కనే ఉన్న 20 పూరిళ్ల కు మంటలు వ్యాపించి పూర్తిగా దగ్దమయ్యాయి. అంతేకాకుండా పూరిళ్లలో ఉన్న గ్యాస్ సిలిండర్లు కూడా పేలుతున్నాయి. సిలిండర్ పేలుళ్ల శబ్దాలతో ప్రజలు పరుగులు తీశారు. ఈ ఘటనపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం…