ఏపీలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ సమీర్ శర్మ ఉత్వర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇరిగేషన్ స్పెషల్ సీఎస్‌గా కేఎస్ జవహర్ రెడ్డి, టీటీడీ ఈఓగా జవహర్ రెడ్డికి అదనపు భాద్యతలు అప్పగించారు. వీరితో పాటు ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా శ్యామల రావు, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ స్పెషల్ సీఎస్‌గా జి. సాయి ప్రసాద్, ఆర్థికశాఖ కార్యదర్శి(కమర్షియల్ టాక్స్)గా ముఖేష్ కుమార్ మీనా ను బదిలీ చేశారు. అంతేకాకుండా పాఠశాల…
ఏపీలోని నెల్లూరు కార్పొరేషన్ తో పాటు కుప్పం పెండింగ్‌లో మరో 12 మున్సిపాలిటీలు, నగరపంచాయతీల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. కాగా అందరి దృష్టి ఇప్పుడు కుప్పం మున్సిపల్ ఫలితాలపైనే ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోటైన కుప్పంలో ఈ సారి ఎలాగైనా వైసీపీ జెండా ఎగరవేయాలని నిర్ణయించుకుంది. కుప్పంను వదులుకునే ప్రసక్తి లేదని టీడీపీ నేతలు సైతం భీష్మించుకున్నారు. ఈ నేపథ్యంలో కుప్పం ఫలితాలపై ఏపీ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.…
ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఆకాశం మేఘావృతమైంది. ఇప్పటికీ ఏపీ, తమిళనాడు తో పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రోడ్లపైకి వర్షపు నీరు రావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ఏపీలో కూడా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ…
తాడేపల్లిగూడెంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేందర్, బొత్స సత్యనారాయణ, గౌతం రెడ్డి, కృష్ణదాస్, బాలినేని, కన్న బాబులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 5 పరిశ్రమలకు ఎస్‌ఐపీబీ గ్నీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. అయితే రూ.2,134 కోట్లతో 5 పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో 7,683 మంది…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి అరెస్టైన విషయం తెలిసిందే. అనంతరం ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా వివేకానంద డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో ఎర్ర గంగిరెడ్డి పేరు మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ పిటిషన్ పై విచారణ చేసిన కడప కోర్టు.. బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను…
దిశ అనే డాక్టర్‌ని నలుగురు నిందుతులు అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశంలో కలకలం రేపింది. అయితే నిందితులను సీన్ రికన్‌స్ట్రక్షన్ చేసేందుకు తీసుకెళితే తప్పించుకునేందుకు ప్రయత్నించారని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఎన్ కౌంటర్ బూటకమని నిందితుల కుటుంబీకులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు దిశ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. తాజాతాదిశ కమిషన్ ముందు బాధిత కుటుంబాల తరపు న్యాయవాదులు పీవీ కృష్ణమా చారి, రజిని లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు…
అగ్నేయ బంగాళఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో విపత్తుల శాఖ కమిషనర్ ఏపీకి పలు సూచనలు జారీ చేశారు. అల్పపీడనం కారణంగా ఎల్లుండి దక్షిణ కోసా, ఉత్తర తమిళనాడు తీరాలకు చేరుకునే అవకాశం ఉందని, తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రేపు కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. రేపు రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయన్నారు.…
కృష్ణ బోర్టుకు చెందిన సభ్యులు రెండవ రోజు నాగర్జున సాగర్‌పై పర్యటించారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ అధికారులతో కేఆర్ఎంబీ బృంద సభ్యులు సమావేశమయ్యారు. అనంతరం కేఆర్ఎంబీ బృంద సభ్యులు మాట్లాడుతూ.. సాగర్ స్థితిగతులు తెలుసుకొని రూట్‌మ్యాప్ తయారీ చేసినట్లు వెల్లడించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ పరిశీలించి నివేదికలు పంపుతామని తెలిపారు. నాగార్జున సాగర విద్యుదుత్పత్తి కేంద్రాలను పరిశీలించలేదని, వచ్చే పర్యటనలో విద్యుదుతప్పత్తి కేంద్రాలు పరిశీలించి నివేదిక సమర్పిస్తామని వారు పేర్కొన్నారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గ్యారబట్టిలో గత శనివారం భీకర ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసింది. ఈ ఎన్ కౌంటర్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందగా, అందులో ఆరుగు మహిళలు ఉన్నారు. అయితే మరణించిన వారిలో కీలక నేతలు ఉండటం గమనార్హం. తాజాగా గడ్చిరోలి జిల్లా కుడుగుల్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ పార్టీలకు మరో మావో మృత దేహం లభ్యమైంది. దీంతో పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ మృతదేహం జహల్ నక్సలైట్ నాయకుడు సుఖ్లాల్…
కుప్పం పురపోరు టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. కుపుం మున్సిపల్ ఎన్నికల నోటిషికేషన్ వచ్చిననాటి నుంచి అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ పార్టీల నేతల మధ్య మాటల యుద్దం నడుస్తూనే ఉంది. అయితే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో దొంగ ఓట్లు వేశారని వైసీపీపై టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ లోక్ సభా పక్షనేత మిథున్ రెడ్డి స్పందిస్తూ..కుప్పంలో దొంగ ఓట్లు అని టీడీపీ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు. ఇంత వరకు…